దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గర్భధారణ గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈక్రమంలోనే పెళ్లి తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకొని సినిమాలలో నటిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈమె గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ తల్లి కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ కొద్దిరోజులలో సర్ప్రైస్ ఇవ్వబోతున్నాను అంటూ చేసిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది. తాజాగా ఈ దంపతులు మా ఫ్యామిలీలోకి కొత్త అతిథి రాబోతున్నారు మా మొదటి బిడ్డ అంటూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ పోస్ట్ చూసిన అభిమానులు కచ్చితంగా కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అనే విషయం తెలియజేస్తారని భావించారు. కానీ కాజల్ అగర్వాల్ కుటుంబంలోకి ఒక పెంపుడు కుక్క వచ్చిందని ఆ కుక్క పిల్లల వారి మొదటి బిడ్డగా భావిస్తున్నట్లు, ఆ కుక్కపిల్లకు కాజల్ దంపతులు
మియా అని పేరును పెట్టినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.
కాజల్ అగర్వాల్ కు చిన్నప్పటి నుంచి పెంపుడు కుక్కలు అంటే ఎంతో భయం అని, కానీ గౌతమ్ కు పెంపుడు కుక్కలు అంటే ఎంతో ఇష్టం ఉండటం వల్ల ఇన్ని రోజులకు మా ఇంట్లోకి ఈ అతిథి వచ్చారంటూ సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…