సాధారణంగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ పై మీడియా ఫోకస్ పెట్టడం సర్వసాధారణం. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీల విషయాలలో మీడియా మరింత ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలోనే గత నెల సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పటి నుంచి ప్రస్తుతం మా ఎలక్షన్స్ వరకు ప్రతి ఒక్క చిన్న విషయంలోనూ మీడియా ఎక్కువ ఆత్రుతను కనబర్చిందని చెప్పవచ్చు.
ఇక సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్ విషయంలో టీవీ9 రిపోర్టర్ ఏకంగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో గొడవ పడిన సంగతి అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే రిపబ్లిక్ సినిమా రిలీజ్ వేడుకలో పవన్ వ్యాఖ్యలను కూడా హైలైట్ చేసింది.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా టీవీ9 ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తాజాగా అక్టోబర్ 10వ తేదీన జరిగిన ఎన్నికలలో ఓటు వేయడానికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవిని మీడియా చుట్టుముట్టింది.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి టీవీ9 ఉద్దేశిస్తూ.. మీకు ఇప్పుడు మంచి మ్యాటర్ దొరికింది కదా అని వెటకారంగా మాట్లాడారు. ఎప్పుడు మీడియా పై నోరుజారిన మెగాస్టార్ చిరంజీవి టీవీ9 పై ఇలా మాట్లాడారు అంటే సాయి ధరమ్ తేజ్ విషయంలో మీడియా చేసిన పనికి మెగా కుటుంబం చాలా ఫీల్ అయ్యారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా నిన్న ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతున్న సమయంలో నటి హేమ శివబాలాజీని కొరికిన సంఘటన వైరల్ అయింది.ఈ సంఘటనను కూడా టీవీ9 ఎక్స్క్లూజివ్ వీడియో విడుదల చేయడం గమనార్హం. ఇక మా ఎన్నికలు కూడా అయిపోవడంతో ఓడిపోయిన క్యాండిడేట్ లతో డిబేట్ లు పెట్టి ఈ విషయాన్ని మరింత పెద్దది చేసి జనాలను ఎంటర్టైన్ చేయడానికి మీడియా సిద్ధమైనట్టు తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…