Shanmukh-Deepthi: షణ్ముఖ్ జశ్వంత్.. దీప్తి బ్రేకప్..! వైరల్ అవుతున్న పోస్టులు..!
Shanmukh-Deepthi: షణ్మఖ్ జశ్వంత్- దీప్తి సునయన వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్నారు వీరిద్దరికి.. బిగ్ బాస్ తరువాత షన్నూ చాలా మందికి తెలిసిపోయాడు. బిగ్ బాస్ సీజన్ 5లో వీజే సన్ని విజేతగా నిలిస్తే.. షన్నూ రన్నరప్ గా నిలిచాడు.
అయితే బిగ్ బాస్ కన్నా ముందుగానే.. షన్నూ, దీప్తీలు లవ్ లో ఉన్నారు. వీరిద్దరు తమ రిలేషన్ ను పెళ్లి వరకు తీసుకెళ్తున్నారని గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే బిగ్ బాస్ తో పెళ్లి నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా వీరిద్దరి మధ్య లవ్ బ్రెకప్ అయిందనే పుకార్లు శికారు చేస్తున్నాయి. దీనికి కారణం.. ఆమె అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు తెగ కామెంట్ పెడుతున్నారు.
బిగ్ బాస్ 5లో షన్నూ, సిరిల మధ్య రిలేషన్ గురించి అంతా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా షణ్ముఖ్ ట్రోఫి గెలవకపోవడానికి కూడా కారణం సిరినే అంటూ నెటిజెన్లు ట్రోలింగ్ కూడా మొదలు పెట్టారు. షన్నూ, సిరిల మధ్య రిలేషన్, హగ్గింగ్, కిస్సింగ్ వ్యవహారంతో షన్నూ, దీప్తిల మధ్య లవ్ బెడిసి కొట్టిందంటూ.. వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇటీవల షన్ను ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని దీప్తి డిలీట్ చేసింది. అయితే దీనికి వేరే కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది.
అయితే సోషల్ మీడియా వేదికగా చేసిన పలు వ్యాఖ్యలు మాత్రం వీరికి మధ్య విబేధాలు తలెత్తాయని చెప్పకనే చెబుతున్నాయి. “ఈ సంవంత్సరం నాకు ఏమి బాలేదు.. అయినా నేను చాలా నేర్చుకున్నాను”.. ‘కనీసం నీ మనస్సాక్షితోనైనా నిజాయితీగా ఉండు’.. ‘నా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారాయని తెలిసినప్పటికీ నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది ఈ అమ్మడు. దీంతో షన్నూతో బ్రెకప్ వార్తలకు మరింతగా బలం చేకూరిందంటూ నెటిజెన్లు అనుకుంటున్నారు. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాలంటే.. మరింత కాలం వేచి చూడాల్సిందే..
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…