షణ్ముఖ్ జస్వంత్.. యూ ట్యూబ్ స్టార్. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు షణ్ముఖ్. “వైవా” అనే షార్ట్ కామెడీ వీడియోతో 2013లో యూట్యూబ్ లోకి అడుగుపెట్టిన ఇతను గత ఏడేళ్ళుగా వరుస షార్ట్ ఫిలిమ్స్ తో నటనలో మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత విడుదలైన “ది సాఫ్ట్ వేర్ డెవలపర్”, “సూర్య” వంటి వెబ్ సిరీస్ లతో యూట్యూబ్ లో మంచి క్రేజ్ సంపాదించి మిలియన్ వ్యూస్ తో దూసుకుపోయాడు.
ఒకవైపు వెబ్ సిరీస్ తోనే కాకుండా ప్రైవేటు సాంగ్స్ తో యూట్యూబ్ స్టార్ గా ఎదిగాడు. ఆఫేమ్ తోనే అతడు ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5 లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి నుంచి అతడు హౌస్ లో తన కంటూ ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకొని మైండ్ గేమ్ ఆడాడు. తర్వాత అతడు విన్నర్ గా నిలుస్తాడు అనుకన్నా.. రన్నర్ గా నిలిచాడు. బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో అతడు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఇందులో హోస్ట్ చేసిన అరియానా అడిగిన ప్రశ్నకు అద్భుతంగా సమాధానాలు ఇచ్చాడు. హౌస్ లో తనకు కెప్టెన్ అవ్వడం బెస్ట్ అని.. తర్వాత పేడలో ముత్యాలు తీయడం, జెస్సీ వెళ్లిపోతున్న సమయం తనకు బెస్ట్ మూమెంట్స్ అని.. చెప్పాడు. తాను కుకింగ్ చేయడం అనేది తాను అస్సలు మర్చిపోను అన్నాడు. అతిగా ఆలోచించడం తనకు ఇబ్బంది కలిగించిందని.. అందులో కూడా.. సిరి విషయంలో ఎక్కువగా ఆలోచించానని అనిపించిందన్నారు. మీ సపోర్ట్ వలన, మీ ఫ్యాన్ బేస్ వలన సిరి టాప్ 5 వరకు వచ్చిందా అని అరియానా అడగ్గా.. ఫిఫ్టీ.. ఫిఫ్టీ అని ఆన్సర్ ఇచ్చాడు షణ్ముఖ్.
ఇక చివరగా.. సిరితో కనెక్ట్ కావడం వలనే రన్నరప్ అయ్యాను అని అనిపించిందా అని అరియానా అడగ్గా.. అదే అయ్యింది అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు షన్నూ. తనకు బయట ఇలా జరుగుతుందని తెలుసని.. కానీ తన ఫీలింగ్స్ ఆపుకోలేదని చెప్పుకొచ్చాడు షణ్ముఖ్.. మొత్తానికి సిరితో కనెక్ట్ కావడం వలనే తను రన్నరప్ అయ్యాయని తెల్చీ చెప్పాడు షన్నూ. తనకు బయట ఇది వేరే రకంగా వెళ్తుందని అనిపించందని.. కానీ తన ఎమోషన్ ఆపుకోలేకపోయాను అన్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…