Sharukh Khan: సాధారణంగా సినిమా షూటింగ్ జరిగే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు ప్రమాదాలు జరగడం సర్వసాధారణం అయితే ఇలా సినిమా షూటింగ్లో యాక్షన్ సన్ని వేశాలలో నటించే సమయంలో అనుకోకుండా కొన్నిసార్లు హీరోలు ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. ఇలా ప్రమాదానికి గురై కొంతమంది మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా షూటింగ్ లొకేషన్లో ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది.అయితే ఈయన గత కొద్ది రోజుల క్రితం ఈ ప్రమాదానికి గురికాగా ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది. షారుక్ ఖాన్ తన కొత్త సినిమా షూటింగ్ నిమిత్తం గత కొద్దిరోజుల క్రితం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కి వెళ్లారట అయితే అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో అనుకోకుండా ప్రమాదానికి గురయ్యారు.
షారుఖ్ ఖాన్ ముక్కు తీవ్రమైన గాయం కావడంతో వెంటనే చిత్ర బృందం ఆయనను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారని తెలుస్తోంది. అయితే ఆయనని పరీక్షించిన వైద్యులు ఫస్ట్ ఎయిడ్ చేసి తనని డిశ్చార్జ్ చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఇండియాకి తిరిగి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారని సమాచారం. ఇలా ఈ ప్రమాదంలో తన ముక్కుకు దెబ్బ తగలడంతో మైనర్ సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారట. త్వరలోనే ఈ సర్జరీ కూడా జరగబోతుందని తెలుస్తోంది.
ఇలా షారుక్ ఖాన్ కి సంబంధించిన ఈ విషయం బయటపడటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను సాధించి సంచలనాలను సృష్టించింది. అయితే త్వరలోనే షారుక్ ఖాన్ నయనతార జంటగా నటించిన జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…