Categories: FeaturedMovie News

Shekar Master : అప్పుచేసి స్థలం కొంటే ఇప్పుడు కనీసం ఫోన్ ఎత్తడం లేదు… మల్లెమాల యాజమాన్యంతో క్లాషెస్..??

Shekhar Master : బ్యాక్ గ్రౌండ్ డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలు పెట్టి కొన్ని సంవత్సరాలు బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా, అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ గా పనిచేసి ప్రస్తుతం కోరియోగ్రాఫర్ గా టాప్ పొజిషన్ లో ఉన్నాడు శేఖర్ మాస్టర్. అటు సినిమాల్లో డాన్స్ కంపోజ్ చేస్తూ హిట్స్ ఇస్తూనే మరోవైపు బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా వ్యవహారిస్తున్నాడు. ముఖ్యంగా ఈటీవీ లో వస్తోన్న ‘ఢీ’ డాన్స్ ప్రోగ్రామ్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు శేఖర్ మాస్టర్. ఆ షోలో మొదలు పెట్టి జడ్జిగా కొనసాగుతూ, ఇక అప్పుడప్పుడు జబర్దస్త్ వంటి షోలలో కూడా జడ్జిగా వ్యవహారిస్తూ ఉండేవాడు. ప్రస్తుతం ఈటీవీ నుండి వెళ్ళిపోయి మా టీవీ లో కామెడి స్టార్స్ కామెడీ షోలో నాగబాబు తో కలిసి జడ్జిగా వ్యవహారిస్తున్నాడు. తన డాన్స్ కంపోజిషన్ కి సినిమాల్లో ఎన్నో అవార్డులు అందుకున్న శేఖర్ మాస్టర్ తన వ్యక్తిగత విషయాలను ఇటీవల ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.

అప్పుచేసి కొంటే మోసం చేశారు…

పెళ్ళికి ముందునుండే డబ్బు పొదుపు చేసుకుని ఆ డబ్బును భూమి మీద పెట్టుబడి పెట్టాలని అలా దాచుకున్న డబ్బుతో స్థలం కొని అది అమ్మి కొంత లాభం తీసుకున్నాను. ఇక ఈ మధ్యనే మళ్ళీ ఒక ల్యాండ్ తెలిసిన స్నేహితుల బంధువే అవడంతో అప్పు తెచ్చి మరీ స్థలం కొనడానికి డబ్బు ఇచ్చాను. హైదరాబాద్, విజయవాడ హైవే లో స్థలం అని చెప్పారు. నమ్మి ఇస్తే లాక్ డౌన్ లో రేట్లు పడిపోయాయి అంటున్నారు. పోనీ ఎంతోస్తే అంత ఇవ్వండి అని అడిగినా ఇప్పటికీ ఇవ్వలేదు. అప్పు ఇచ్చిన వాళ్ళు అడుగుతున్నారు. ఇక కొంత కాలంగా నా ఫోన్ కి కూడా వాళ్ళు స్పందించడం లేదు అంటూ చెప్పారు. ఇక విజయవాడలో పెద్దగా పరిచయం లేని వ్యక్తి నాకు ల్యాండ్ చూపించాడు. ఆ ల్యాండ్ కొని అమ్మిన డబ్బులతో ఇక్కడ మళ్ళీ ల్యాండ్ కొనుకున్నాను. అలా తెలిసిన వాళ్ళు నన్ను మోసం చేసారు. ఎవరో తెలియని వ్యక్తి నాకు మంచి చేసాడు అంటూ శేఖర్ తెలిపారు.

మల్లెమాలతో విబేధాలు…

ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షోలో మొదట కంటెస్టెంట్ గా మొదలయిన శేఖర్ మాస్టర్ ఇంకా డాన్స్ మాస్టర్ అవకుండా గ్రూప్ డాన్సర్ గా ఉన్నా సమయంలోనే ఈ షోలో పాల్గొన్నారు. ఇక మొదట విన్నర్ అవకపోవడం నిరాశ కలిగించింది. మళ్ళీ ఢీ ఐదో సీజన్ లో పాల్గొని విజేతగా నిలిచిన శేఖర్ మాస్టర్ మొదట సుధీర్ బాబు సినిమా ‘ఎస్ఏంఎస్’ సినిమాలో అవకాశం సంపాదించుకున్నారు. ఆ తరువాత అల్లు అర్జున్ ‘జులాయి’ అలా మంచి ఆఫర్స్ తో కెరీర్ లో దూసుకెళ్లాడు. ఇక పార్టిసిపెంట్ గా వచ్చిన షోలోనే జడ్జిగా మళ్ళీ ఢీ షోకి వచ్చాడు. చాలా సీజన్స్ కి జడ్జిగా ఢీ షోలో సాగిన శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఆ షో నుండి తప్పుకున్నారు. ఇక మా టీవీలో వస్తున్న కామెడీ ప్రోగ్రామ్ లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఢీ నుండి తప్పుకోడానికి కారణాలను చెబుతూ ఓంకార్ తో మంచి అనుబంధం ఉండటం వల్ల ఆయన అడిగారని కామెడీ స్టార్స్ కి జడ్జిగా వెళ్ళాను. అయితే ఢీ వాళ్ళను అడిగాను ఇది డాన్స్ షో అదో కామెడీ షో కాబట్టి సమస్య లేదు వెళ్లామన్నారు. కొన్నిరోజుల తరువాత చిన్న ఇష్యూ వల్ల మా టీవీలో మానేసి వచ్చేయమని అడగడంతో మాటిచ్చి ఎలా మధ్యలో వచ్చేయడం అని అలోచించి ఢీ నుండి తప్పుకున్నాను. కొత్త సీజన్ లో మళ్ళీ ఢీ కి రమ్మని పిలిచారు. వెళితే వెళతానేమో ఇప్పటికేయితే తెలియదు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago