Categories: FeaturedMovie News

Radhika : ఆ పాటలో నాకు కమల్ కి మధ్య రొమాన్స్ కుదరడం లేదని విశ్వనాథ్ గారు అలా చేశారు.. కానీ కమల్ అపార్థం చేసుకున్నారు. : రాధిక

Radhika : రాధిక ఒక ప్రముఖ తమిళ, తెలుగు చలనచిత్ర కథానాయిక. సన్ టీవీ ప్రేక్షకులకు ఈమె సుపరిచితం. రాడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్ వర్క్ ద్వారా ప్రసారమౌతున్న చాలా తమిళ, తెలుగు ధారావాహికలను ఈమె నిర్మిస్తున్నారు. రాధిక అలనాటి ప్రముఖ తమిళ నటుడు ఎం.ఆర్.రాధా కూతురు. ఈమె తల్లి గీత శ్రీలంకకు చెందినది. ఈమె మొదటగా తమిళ చిత్రాలలో నటించింది. ఆ తర్వాత న్యాయం కావాలి, ప్రియా చిత్రాల్లో చిరంజీవి తో కలిసి తెలుగు తెరకు పరిచయమయ్యారు. అల్లరి, పొగరుబోతు పాత్రలతో అప్పటివరకు నటించిన రాధిక ఒక్కసారి నిశ్శబ్దంగా, స్తబ్దుగా ఉండే గృహిణిగా కొనసాగే పాత్రలో ఆమె నటించారు.

1986లో విడుదలైన ఓ తెలుగు కుటుంబ కథా చిత్రం. పెద్దలని ఎదిరించి పెళ్ళి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి, చిన్నపుడే భర్త పోతే ఎదురుకున్నపరిస్థితులు, అనుకోకుండా ఆమె జీవితం లోకి వచ్చిన ఒక అమాయకపు యువకుడు, ఆ తరువాత వారిద్దరి జీవన ప్రయాణం,ఇది స్థూలంగా కథ. పూర్ణోదయ బ్యానర్, ఏడిద నాగేశ్వరరావు నిర్మాణం,కె విశ్వనాథ్ దర్శకత్వంలో స్వాతిముత్యం చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో కమలహాసన్, రాధిక హీరో, హీరోయిన్లుగా నటించారు. అప్పటివరకు రాధిక.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవితో నటించిన రాధిక కమలహాసన్ తో 1985 వరకు నటించలేదు.

స్వాతిముత్యంలో కమల్ హాసన్ ప్రక్కన హీరోయిన్ గా రాధికకు అవకాశం రావడంతో చాలా సంతోషపడ్డారు…అలా ఆమె స్వాతిముత్యం సినిమాలో నటించారు.ఒక ఇంటర్వ్యూలో.. స్వాతిముత్యం సినిమాకి సంబంధించి మీకు గుర్తున్న ఆనాటి కొన్ని మెమోరీస్ చెప్పండని యాంకర్ అడగగా.. కే విశ్వనాథ్ డైరెక్షన్ లో నటించడం మర్చిపోలేని జ్ఞాపకమని.. అలాగే కమలహాసన్ తో కూడా నటించడం కూడా ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. అయితే “మనసు పలికే మౌనగీతం… అనే పాట చిత్రీకరణ సమయంలో ఆ పాటలో నాకు కమలహాసన్ కి మధ్య కొంత రొమాన్స్ ఉంటుంది. ఆ పాట చిత్రీకరణ సందర్భంలో…నేను కమలహాసన్ కలిసి రొమాన్స్ సీన్ బాగా చేసాము అని అనుకున్నాం. కానీ విశ్వనాథ్ గారు ఎందుకో కన్విన్స్ కాలేకపోయారు.

మళ్లీ ఒక టేక్ చేశాం. అయినా విశ్వనాథ్ గారికి నచ్చలేదు. కమల్ ఏంటి ప్రాబ్లమ్? అని అడగగా నో సార్ ఐయామ్ ఓకే అని అన్నారు. నాతో మాట్లాడిన తర్వాత ఎందుకో విశ్వనాథ్ గారు బాగా ఆలోచించి మా మధ్య కెమిస్ట్రీ కుదరడం లేదని కమల్ కి పర్ఫ్యూమ్ కొట్టారు. ఆ తర్వాత చిత్రీకరించిన ఆ పాట ఓకే అవ్వడంతో.. విశ్వనాథ్ గారిచే కమల్ కి నేనే పర్ఫ్యూమ్ కొట్టించానని.. ఎప్పుడు కమలహాసన్ అంటుంటారని.. కానీ ఆ విషయమే నాకు తెలియదని ఆనాటి జ్ఞాపకాలను రాధిక ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఏదైతేనేం రాధిక నటన స్వాతిముత్యం కంటే ముందు ఆ తర్వాత అన్నట్టుగా ఈ సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలను పొందడం జరిగింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago