Radhika : రాధిక ఒక ప్రముఖ తమిళ, తెలుగు చలనచిత్ర కథానాయిక. సన్ టీవీ ప్రేక్షకులకు ఈమె సుపరిచితం. రాడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్ వర్క్ ద్వారా ప్రసారమౌతున్న చాలా తమిళ, తెలుగు ధారావాహికలను ఈమె నిర్మిస్తున్నారు. రాధిక అలనాటి ప్రముఖ తమిళ నటుడు ఎం.ఆర్.రాధా కూతురు. ఈమె తల్లి గీత శ్రీలంకకు చెందినది. ఈమె మొదటగా తమిళ చిత్రాలలో నటించింది. ఆ తర్వాత న్యాయం కావాలి, ప్రియా చిత్రాల్లో చిరంజీవి తో కలిసి తెలుగు తెరకు పరిచయమయ్యారు. అల్లరి, పొగరుబోతు పాత్రలతో అప్పటివరకు నటించిన రాధిక ఒక్కసారి నిశ్శబ్దంగా, స్తబ్దుగా ఉండే గృహిణిగా కొనసాగే పాత్రలో ఆమె నటించారు.

1986లో విడుదలైన ఓ తెలుగు కుటుంబ కథా చిత్రం. పెద్దలని ఎదిరించి పెళ్ళి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి, చిన్నపుడే భర్త పోతే ఎదురుకున్నపరిస్థితులు, అనుకోకుండా ఆమె జీవితం లోకి వచ్చిన ఒక అమాయకపు యువకుడు, ఆ తరువాత వారిద్దరి జీవన ప్రయాణం,ఇది స్థూలంగా కథ. పూర్ణోదయ బ్యానర్, ఏడిద నాగేశ్వరరావు నిర్మాణం,కె విశ్వనాథ్ దర్శకత్వంలో స్వాతిముత్యం చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో కమలహాసన్, రాధిక హీరో, హీరోయిన్లుగా నటించారు. అప్పటివరకు రాధిక.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవితో నటించిన రాధిక కమలహాసన్ తో 1985 వరకు నటించలేదు.

స్వాతిముత్యంలో కమల్ హాసన్ ప్రక్కన హీరోయిన్ గా రాధికకు అవకాశం రావడంతో చాలా సంతోషపడ్డారు…అలా ఆమె స్వాతిముత్యం సినిమాలో నటించారు.ఒక ఇంటర్వ్యూలో.. స్వాతిముత్యం సినిమాకి సంబంధించి మీకు గుర్తున్న ఆనాటి కొన్ని మెమోరీస్ చెప్పండని యాంకర్ అడగగా.. కే విశ్వనాథ్ డైరెక్షన్ లో నటించడం మర్చిపోలేని జ్ఞాపకమని.. అలాగే కమలహాసన్ తో కూడా నటించడం కూడా ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. అయితే “మనసు పలికే మౌనగీతం… అనే పాట చిత్రీకరణ సమయంలో ఆ పాటలో నాకు కమలహాసన్ కి మధ్య కొంత రొమాన్స్ ఉంటుంది. ఆ పాట చిత్రీకరణ సందర్భంలో…నేను కమలహాసన్ కలిసి రొమాన్స్ సీన్ బాగా చేసాము అని అనుకున్నాం. కానీ విశ్వనాథ్ గారు ఎందుకో కన్విన్స్ కాలేకపోయారు.

మళ్లీ ఒక టేక్ చేశాం. అయినా విశ్వనాథ్ గారికి నచ్చలేదు. కమల్ ఏంటి ప్రాబ్లమ్? అని అడగగా నో సార్ ఐయామ్ ఓకే అని అన్నారు. నాతో మాట్లాడిన తర్వాత ఎందుకో విశ్వనాథ్ గారు బాగా ఆలోచించి మా మధ్య కెమిస్ట్రీ కుదరడం లేదని కమల్ కి పర్ఫ్యూమ్ కొట్టారు. ఆ తర్వాత చిత్రీకరించిన ఆ పాట ఓకే అవ్వడంతో.. విశ్వనాథ్ గారిచే కమల్ కి నేనే పర్ఫ్యూమ్ కొట్టించానని.. ఎప్పుడు కమలహాసన్ అంటుంటారని.. కానీ ఆ విషయమే నాకు తెలియదని ఆనాటి జ్ఞాపకాలను రాధిక ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఏదైతేనేం రాధిక నటన స్వాతిముత్యం కంటే ముందు ఆ తర్వాత అన్నట్టుగా ఈ సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలను పొందడం జరిగింది.



























