Shekhar Master : బ్యాక్ గ్రౌండ్ డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలు పెట్టి కొన్ని సంవత్సరాలు బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా, అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ గా పనిచేసి ప్రస్తుతం కోరియోగ్రాఫర్ గా టాప్ పొజిషన్ లో ఉన్నాడు శేఖర్ మాస్టర్. అటు సినిమాల్లో డాన్స్ కంపోజ్ చేస్తూ హిట్స్ ఇస్తూనే మరోవైపు బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా వ్యవహారిస్తున్నాడు. ముఖ్యంగా ఈటీవీ లో వస్తోన్న ఢీ డాన్స్ ప్రోగ్రామ్. ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు శేఖర్ మాస్టర్. ఆ షోలో మొదలు పెట్టి జడ్జిగా కొనసాగుతూ అప్పుడప్పుడు జబర్దస్త్ వంటి షోలలో కూడా జడ్జిగా వ్యవహారిస్తూ ఉండేవాడు. ప్రస్తుతం ఈటీవీ నుండి వెళ్ళిపోయి మా టీవీ లో కామెడి స్టార్స్ కామెడీ షోలో నాగబాబు తో కలిసి జడ్జిగా వ్యవహారిస్తున్నాడు. తన డాన్స్ కంపోజిషన్ కి సినిమాల్లో ఎన్నో అవార్డులు అందుకున్న శేఖర్ మాస్టర్ తన వ్యక్తిగత విషయాలను ఇటీవల ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.
ఢీ షో నుండి అందుకే వెళ్లిపోవాల్సి వచ్చింది…
ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షోలో మొదట కంటెస్టెంట్ గా మొదలయిన శేఖర్ మాస్టర్ ఇంకా డాన్స్ మాస్టర్ అవకుండా గ్రూప్ డాన్సర్ గా ఉన్న సమయంలోనే ఈ షోలో పాల్గొన్నారు. ఇక మొదట విన్నర్ అవకపోవడం నిరాశ కలిగించింది. మళ్ళీ ఢీ ఐదో సీజన్ లో పాల్గొని విజేతగా నిలిచిన శేఖర్ మాస్టర్ మొదట సుధీర్ బాబు సినిమా ‘ఎస్ఏంఎస్’ సినిమాలో అవకాశం సంపాదించుకున్నారు. ఆ తరువాత అల్లు అర్జున్ ‘జులాయి’ అలా మంచి ఆఫర్స్ తో కెరీర్ లో దూసుకెళ్లాడు. ఇక పార్టిసిపెంట్ గా వచ్చిన షోలోనే జడ్జిగా మళ్ళీ ఢీ షోకి వచ్చాడు. చాలా సీజన్స్ కి జడ్జిగా ఢీ షోలో సాగిన శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఆ షో నుండి తప్పుకున్నారు. ఇక మా టీవీలో వస్తున్న కామెడీ ప్రోగ్రామ్ లో జడ్జిగా వ్యవహారిస్తున్నారు. అయితే ఢీ నుండి తప్పుకోడానికి కారణాలను చెబుతూ ఓంకార్ తో మంచి అనుబంధం ఉండటం వల్ల ఆయన అడిగారని కామెడీ స్టార్స్ కి జడ్జిగా వెళ్ళాను. అయితే ఢీ వాళ్ళను అడిగాను ఇది డాన్స్ షో అదో కామెడీ షో కాబట్టి సమస్య లేదు వెళ్లమన్నారు. కొన్నిరోజుల తరువాత చిన్న ఇష్యూ వల్ల మా టీవీలో మానేసి వచేయమని అడగడంతో మాటిచ్చి ఎలా మధ్యలో వచ్చేయడం అని అలోచించి ఢీ నుండి తప్పుకున్నాను. కొత్త సీజన్ లో మళ్ళీ ఢీ కి రమ్మని పిలిచారు. వెళితే వెళతానేమో ఇప్పటికేయితే తెలియదు అంటూ చెప్పారు.
శ్రీముఖి ముద్దుల విషయంలో నాకు సంబంధం లేదు…
జబర్దస్త్, ఢీ లలో కనిపిస్తూ ఇక అప్పుడప్పుడు పండగ ఈవెంట్లలో సందడి చేస్తుండే శేఖర్ మాస్టర్ అమ్మాయిలను ఫ్లర్ట్ చేస్తారంటూ సరదాగా అనేవారు. ఇక రోజా, అనసూయ, రష్మీ లతో డాన్స్ చేసినా కామెంట్స్ చేసేవాళ్ళు. అలా ఒకసారి పాటకు శ్రీముఖితో డాన్స్ చేస్తుంటే అనుకోకుండా తాను ముద్దు పెట్టేసింది. ఇక అది బాగా వైరల్ అయింది అసలు ఆ ముద్దులకు నాకు ఏం సంబంధం లేదు పాటలో అలా అనుకోకుండా చేసేసింది శ్రీముఖి అని వివరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…