Movie News

Shiva Jyothi: ఖరీదైన బీఎండబ్ల్యూ కార్ కొనుగోలు చేసిన తీన్మార్ సావిత్రి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Shiva Jyothi:తీన్మార్ వార్తలు ద్వారా తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు శివజ్యోతి. ఇలా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇలా తీన్మార్ వార్తలు ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న శివ జ్యోతి బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం అనంతరం వరుస బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. అలాగే జ్యోతక్క అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో వీడియోలను యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు.

ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన శివ జ్యోతి ఆ ఖరీదైన ఇంటికి అనుగుణంగా ఓ మంచి కారు ఉండాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే దసరా పండుగ సందర్భంగా ఈమె ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేశారు. సాధారణంగా దసరా వంటి ముఖ్యమైన పండుగల రోజు ఖరీదైన కార్లను ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే ఇలాంటి ప్రత్యేక రోజులలో కొత్త కార్లను కొనుగోలు చేయడానికి సెలబ్రెటీలు ముందు వరుసలో ఉంటారు.

Shiva Jyothi: ముచ్చటగా మూడో కారు కొన్న శివ జ్యోతి…

ఇప్పటికే బిత్తిరి సత్తి షణ్ముఖ్ జస్వంత్ వంటి వారు కొత్త కార్లను కొనగా తాజాగా శివ జ్యోతి కూడా ఖరీదైన కారుని కొనుగోలు చేశారు.అయితే ఈమె తన కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి ఇది మూడవ కారు కావడం విశేషం. ఇప్పటికే రెండు కార్లను కొనుగోలు చేసిన శివ జ్యోతి తాజాగా ఖరీదైన బీఎండబ్ల్యూ కారణం కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతోమంది ఈ ఫోటోలపై స్పందిస్తూ తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago