Shiva Shakthi Datta : సినిమా తీయాలనే కోరికతో చెన్నైకి వచ్చిన శివ శక్తి దత్త గారు ఇప్పటి వరకు ఆ అవకాశం రాక ఎదురుచూశారు. ప్రస్తుతం ఆయన వయసు 91 సంవత్సరాలు అయినా కూడా ప్రస్తుతం ‘తిరుమల నాయక’ అనే సినిమాకు దర్శకుడిగా చేస్తున్నారు. స్వతహాగా ఆర్టిస్ట్ అయిన ఆయన ఎన్నో పెయింటింగ్స్ వేశారు. శివ శక్తి దత్త గారి సోదరుడు విజయేంద్ర ప్రసాద్ గారు కాగా ఆయన కొడుకు కీరవాణి, అలాగే విజయేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి రాజమౌళి. ఇక శివ శక్తి దత్త గారికి నలుగురు సోదరులు కాగా సినిమా మీద ఆసక్తి తో ఆయన చెన్నైకి వచ్చారు. ఆస్తులను పోగొట్టుకున్నా సినిమా ఇండస్ట్రీలోనే నిలబడ్డారు. ఇక 91 ఏళ్ల వయసులో ఆయన ఇప్పుడు తిరుమల నాయక అనే సినిమాను డైరెక్షన్ చేస్తూ ఆయన చిరకాల కోరికను నెరవేర్చుకుంటున్నారు.
మందు తాగని డైరెక్టర్ అతనే…
శివ శక్తి దత్త గారు తన పిల్లలు గురించి మాట్లాడుతూ కీరవాణికి సంగీతమే ప్రపంచం కాదు అది కాకుండా ఇతర వ్యాపకాలు ఉన్నాయి. అయితే రాజమౌళి కి మాత్రం అలాంటి వ్యాపకాలు ఏమీ లేవని, ఏ పని చేస్తున్నా సినిమా గురించే ఆలోచిస్తుంటాడు అంటూ చెప్పారు. తన రాబోయే సినిమాలో ఎలా సీన్స్ ఉండాలి అనే విషయం గురించే ప్రతి క్షణం రాజమౌళి ఆలోచిస్తూ ఉంటాడు.
అది తెచ్చిపెట్టుకున్న స్వభావం కూడా కాదు సహజంగా తనకు వచ్చింది. ఇంట్లో అందరూ కలిసి పేకాట సరదాగా ఆడుతుంటారు. ఆ ఆడుతున్నపుడు కూడా రాజమౌళి సినిమా గురించి ఆలోచిస్తాడు, సినిమా తప్ప వేరే ప్రపంచం తనకు తెలియదు. సిగరెట్, మందు వంటి అలవాట్లు నాకు తెలిసి లేవు, ఇండస్ట్రీలో అలా ఎటువంటి అలవాట్లు లేని డైరెక్టర్ వాడొక్కడే అంటూ శివ శక్తి దత్త అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…