కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో చాలామంది ప్రయాణాలు చేస్తున్న సమయంలోనే కరోనా వైరస్ బారిన పడుతున్నారు. నిపుణులు గతంతో పోలిస్తే ప్రయాణ డిమాండ్ 75 శాతం కుప్పకూలిందని.. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణికులు ప్రయాణాలపై ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు.
కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో ఏకంగా 50 లక్షల మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గ్లోబల్ ఏవియేషన్ బాడీ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) ఈ విషయాలను వెల్లడించింది. కరోనా విజృంభణ వల్ల ఏర్పడిన పరిమితుల నేపథ్యంలో విమానాల తయారీ సామర్థ్య పరిశ్రమ, మౌలిక సదుపాయాలు, గ్రౌండింగ్ విమానాల పరిశ్రమలలో ఉద్యోగులకు పని లేకుండా పోయింది.
ప్రపంచవ్యాప్తంగా గతంతో పోలిస్తే విమాన సర్వీసుల సంఖ్య భారీగా తగ్గడంతో లక్షల మంది ఉద్యోగులపై ఆ ప్రభావం పడింది. ఐటీఎఫ్ ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ కాటన్ మాట్లాడుతూ కరోనా విజృంభణ వల్ల ఏవియేషన్ రంగం ఉపాధి విపత్తును ఎదుర్కొంటోందని.. విమానయాన పరిశ్రమ సంక్షోభ స్థితిలో ఉందని తెలిపారు. గతంలో విమానయాన శాఖ ఉద్యోగులకు అమలైన పథకాల్లో 80 శాతం పథకాలు నిలిచిపోయాయని ఆయన అన్నారు.
దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా విమాన రంగం ఉపాధి విపత్తును ఎదుర్కోనుందని.. ప్రభుత్వాల జోక్యం ఉంటే మాత్రమే ఈ స్థితి నుంచి బయటపడవచ్చని చెప్పారు. సంస్కరణలు, పునరుద్ధరణల ద్వారా మాత్రమే సంక్షోభాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…
తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…
భారతదేశంలో ఉద్యోగ రంగంలో కీలక మార్పులకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త లేబర్ కోడ్‌లు ఇప్పుడు…
వర్చువల్ రియాలిటీ (VR) అంటే ఇప్పటివరకు ఎక్కువ మందికి గుర్తొచ్చేది వీడియో గేమ్స్ లేదా యువత వినోదం మాత్రమే. అయితే…