Shravan Bhargavi : ‘ఒకపరి ఒకపరి’ అంటూ అన్నమయ్య కీర్తనను ఆలపించి వీడియో తీసి యూట్యూబ్ ఛానెల్ లో పెట్టింది శ్రావణ భార్గవి. వీడియో నచ్చితే క్షణాల్లో ట్రెండ్ అవుతుంది అలాగే వీడియో లో అనుచితంగా ఏదైనా ఉన్నా వెంటనే వైరల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది వివాదాస్పద వాఖ్యలు చేయడం ద్వారా ఫేమస్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. నెగెటివ్ గానో పాజిటివ్ గానో ఎలాగైనా జనాల నోళ్లలో నానితే ఫేమస్ అయిపోయి సెలబ్రిటీ అవుతామన్న భావన ఎక్కువైంది.
శ్రావణ భార్గవి అమ్ముడూబోయింది అనిపిస్తుంది…
ఇక శ్రావణ భార్గవి అన్నమయ్య భక్తి కీర్తనను శృంగార పాటగా కాళ్లూపుతూ పాడటం, రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టిందంటూ హిందూత్వ సంఘాలు, అన్నమయ్య వంశస్థులు ఆందోళన వ్యక్తం చేసారు. ఇక దీని మీద చాలా మంది నెటిజన్స్ ట్రోల్ చేయడం, కొంత మంది శ్రావణ భార్గవి కి సపోర్ట్ చేయడం చేస్తున్నారు. ఇక ఈవివాదం గురించి ప్రొడ్యూసర్ చిట్టిబాబు మాట్లాడుతూ ఇలా చేసి సరస్వతి దేవి ఆగ్రహానికి గురవుతుంది అంటూ శాపాలు పెట్టాడు.
డబ్బుకోసం అమ్ముడుబోయి ఇలాంటి వీడియోలు చేసిందని, హిందూత్వాన్ని కించపరిచే వారిచ్చే డబ్బులకోసం వివాదం ద్వారా పేరు తెచ్చుకుంటే తన వీడియోని చాలా మంది చూస్తారనే భావనతో, ఇలా చేసిందని వాఖ్యణించారు. అన్నమయ్య కీర్తనను అలా కించపరిచి పాడటం తప్పని తనకు అనిపించలేదా మళ్ళీ తాను బ్రాహ్మణ అమ్మాయిని అంటూ చెప్పుకుంటోంది. ఇలాంటి వాళ్ళ ద్వారా హిందూత్వ సంప్రదాయాలను బలహీన పరిచేలా ప్లాన్ చేస్తూ రెచ్చగొడుతున్నారు. ఇక వీటిపై డిబేట్లు పెట్టి ఫ్రీలాన్సర్ జర్నలిస్టులలో కొంతమంది డబ్బుతో కొని అందులో తప్పేంటి అన్నట్లు గా మాట్లాడిస్తారంటూ చెప్పారు. నుపూర్ శర్మ విషయంలోనూ ఇదే జరిగింది. ఆ అమ్మాయి మాట్లాడినదాన్నే రాద్ధాంతం చేసారు. డిబేట్ లో ఆ అమ్మాయి అలా మాట్లాడటానికి అటు వైపు వ్యక్తి ఏం మాట్లాడాడో ఎవరు పట్టించుకోలేదు. ఒక శివలింగాన్ని పురుషాంగం తో పోల్చడం ఎవరికీ కనిపించలేదు. అ అమ్మాయిని మాత్రం బాగా ట్రోల్ చేసారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి అంటూ చెప్పాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…