Shriya Saran: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ రష్యాకు చెందిన వ్యాపారవేత్త ఆండ్రీ కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరికీ ఓ పాప అనే విషయాన్ని కూడా శ్రీయ వెల్లడిస్తూ అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేశారు. ఇలా తన భర్త కూతురుకి సంబంధించిన అన్ని విషయాలను శ్రీయ అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.
పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంటున్న శ్రియ తాజాగా తన భర్త అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.తన భర్త హెర్నియా అనే వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని వెల్లడించారు.
అయితే అతనికి సర్జరీ విజయవంతంగా జరిగిన నేపథ్యంలో శ్రీయ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.గత రెండు నెలల నుంచి తన భర్త ఈ వ్యాధితో బాధ పడుతున్నారని అప్పుడు తన కూతురిని కూడా ఎత్తుకో లేని పరిస్థితిలో ఉన్నారని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం తనకు సర్జరీ జరిగిన తర్వాత కోలుకుంటున్నాడని వెల్లడించింది.
ఇలా తన భర్తకు విజయవంతంగా సర్జరీ నిర్వహించినందుకు అపోలో వైద్యులకు ఈమె కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే సర్జరీ కోసం వారికి ఎంతో సహకరించిన అపోలో హాస్పిటల్ వైద్యులు యాజమాన్యం అలాగే మెగా కోడలు ఉపాసన కొణిదెల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆండ్రియో చేతికి బ్యాండేజీలతో దర్శనమిచ్చిన ఫొటోలను జత చేసి ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది.ఇక ఈ పోస్ట్ పై స్పందించిన ఉపాసన కొణిదెల అంతా సవ్యంగానే జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ రిప్లై ఇచ్చారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…