Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా థియేటర్ల నుంచి దాదాపు తీసేస్తున్నటువంటి తరుణంలో ఈ సినిమా సెలబ్రిటీలు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇప్పుడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నటి శృతిహాసన్ ప్రభాస్ తో పాటు పృధ్విరాజ్ సుకుమారన్ ఇద్దరినీ కూడా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా శృతిహాసన్ ప్రభాస్ గురించి పలు విషయాలు తెలియజేయడమే కాకుండా ఆయనని రెబల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారు అంటూ ప్రశ్నించారు.
సలార్ సినిమాకు నేను కమిట్ అయిన తర్వాత అందరూ కూడా డార్లింగ్ తో సినిమా చేస్తున్నావా అంటూ నన్ను అడిగితే నేను అవును అంటూ సమాధానం చెప్పేదాన్ని అయితే ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్న తర్వాత వారం రోజులకు అసలు ప్రభాస్ గారిని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో స్పష్టంగా అర్థమైంది అంటూ శృతిహాసన్ వెల్లడించారు.
పెదనాన్న వల్లే…
ఇక ఈ విషయం గురించి పృథ్వీరాజ్ మాట్లాడుతూ డార్లింగ్ ఎందుకంటారు నాకు తెలుసు కానీ రెబల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో ఇప్పటికీ తెలియదు అంటూ మాట్లాడారు. దీంతో శృతిహాసన్ వెంటనే ఎందుకు నిన్ను రెబెల్ స్టార్ అని పిలుస్తారు అంటూ ప్రభాస్ ను ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు ప్రభాస్ మా పెదనాన్న రెబల్ స్టార్ కావడంతో నన్ను కూడా అలాగే యంగ్ రెబెల్ స్టార్ అని పిలుస్తారు అంటూ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…