నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కొటేషన్లు పెడుతూ, ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. విడాకుల తర్వాత సమంత ఏ ట్వీట్ చేసినా కూడా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. విడాకుల తర్వాత అదే విషయాన్ని ప్రస్తావిస్తూ రోజుకు ఒక విషయాన్ని తెరమీదకు తీసుకు వస్తోంది సమంత. వీరు విడాకులు తీసుకుని దాదాపుగా నెల రోజులు దాటినా కూడా వీరిద్దరికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత.. వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న పరిణామాలు తాను నిర్మించుకున్న కలల ప్రపంచాన్ని చిది మేశాయని తెలిపింది. ఈ విషయం పై పలువురు నెటిజన్ లు పాజిటివ్ గా స్పందించగా.. ఇంకొందరు నెటిజన్ లు అసభ్యకరమైన మెసేజ్ లు చేస్తున్నారని తెలిపింది. ఇదే విషయం పై స్పందించిన టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా రిప్లై ఇచ్చాడు.
నేటి టాక్సిక్ సోషల్ మీడియా ప్రపంచంలో స్టార్స్ సొంతంగా ఫ్యాన్స్ గ్రూప్ ని ఏర్పాటు చేసుకునేందుకు ఖర్చు పెడుతున్నారని అభిప్రాయపడ్డాడు. ఏది తనంత తానే జరగదన్న సిద్దార్థ్.. తాము పెంచి పోషించిన అభిమానులు చివరకు కాటేస్తారన్న విషయాన్ని గుర్తించడం మంచిదనే విధంగా ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు సమంతను హెచ్చరించేందుకు ఈ ట్వీట్ చేశాడని అంటున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…