Karthika Pournami: హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే 12 మాసాలు కూడా ఎంతో విశిష్టమైనవి అని చెప్పాలి. అయితే ఇందులో కార్తీక మాసానికి మరింత విశిష్టత ఉంది. కార్తీకమాసం శివ కేశవలకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. అందుకే ఈ నెలలో శివ కేశవులను పూజించడం వల్ల వారి అనుగ్రహం మనపై ఉండి ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారని పండితులు చెబుతుంటారు.
ఈ పవిత్రమైనటువంటి కార్తీకమాసంలో ప్రతి ఒక్కరూ కూడా దీపారాధనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. ఇలా సూర్యోదయానికి ముందే తలంటు స్నానం చేసి ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి సకల సంపదలు కలుగుతాయని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. అయితే ఈ కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది.
ఈ రోజు కనుక మనం దీపారాధన చేయటం వల్ల సంవత్సరంలో మనం ఏ రోజు దీపారాధన చేయకపోయినా ఈరోజు చేసిన పుణ్యఫలం కలుగుతుందని చెప్పాలి.ఈ కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున ఆలయాలలోనూ తులసి కోట ముందు కూడా ఇక దీపాలను వెలిగిస్తూ ఆ శివకేశవులను ఆరాధిస్తూ ఉంటారు..ఇలా దీపారాధనకు ఎంతో పవిత్రమైనటువంటి ఈ కార్తీక పౌర్ణమి రోజు మరికొన్ని పనులు చేయటం వల్ల కూడా ఆ శివకేశవుల అనుగ్రహం మన పైనే ఉంటుంది.
దానధర్మాలు చేయాలి..
కార్తీక పౌర్ణమి దీపారాధనకు ఎంత విశిష్టత కలిగి ఉందో దానధర్మాలకు కూడా అంతే విశిష్టత కలిగి ఉంది. అందుకే మనకు తోచిన మేరకు మన ఆర్థిక స్తోమత బట్టి ఇతరులకు దానధర్మాలు చేయడం ఎంతో మంచిది.
పవిత్రమైన కార్తీక మాసం రోజున చేయాల్సిన మరి కొన్ని ముఖ్యమైన పనులు ఏంటి అనే విషయానికి వస్తే.. దైవ దర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహణ. ఇలా పౌర్ణమి రోజు ఈ పనులను చేయటం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరసం తగ్గించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఈ…
మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అలాంటి వాటిలో ఉదయం వేళ లేవడం ఒక…
ముఖం ఎప్పుడూ ఫ్రెష్‌గా, కాంతివంతంగా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే కొన్నిసార్లు కారణం తెలియకుండానే ముఖం ఉబ్బినట్లు, ఎర్రబడినట్లు…
భారతీయ వంటింట్లో చింతపండు లేకుండా చాలా వంటలు పూర్తవవు. పులుపు రుచిని ఇచ్చే ఈ సహజ పదార్థం కేవలం రుచికే…
భారతీయ కరెన్సీ నోట్లపై కనిపించే చిత్రాలు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా, దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా…
హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఒక అరుదైన వైద్య ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేవలం కొన్ని రసగుల్లాలు తిన్న తర్వాత 35…