Silk Smitha : తెలుగులోనే కాకుండా సౌత్ మొత్తం ఒక ఊపు ఊపిన శృంగార తార సిల్క్ స్మిత. తన జీవితంలో ఎంత త్వరగా ఫేమ్ వచ్చిందో అంతే త్వరగా ఆమె ఆస్తులను కోల్పోయి చివరికి ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఆమె మరణానికి కారణం నమ్మిన వాళ్ళే మోసం చేశారు, వ్యసనాలకు బానిస అయి మొత్తం ఆస్తులను కరిగించేసింది, చివరకు ఆత్మహత్య చేసుకుంది అని రకరకాల వార్తలు వినిపించాయి. ఇక తొంభైలలో సిల్క్ స్మిత క్రేజ్ మామూలుగా లేదు.
నమ్మిన వాళ్ళే మోసం చేసారు…
200 పైగా సినిమాల్లో అన్ని భాషలలో నటించిన సిల్క్ స్మిత అప్పట్లో బాగా డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్, ఒకానొక టైములో హీరోయిన్స్ కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంది కూడా. అలాంటి సిల్క్ దాదాపు 15 సంవత్సరాల సినిమా కెరీర్ లో కొన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టింది. ఇక ఆస్తులను రెట్టింపు చేయడానికి నిర్మాతగా మారి సినిమాలను తీసింది కానీ అందులో లాభాల కన్నా నష్టాలనే ఎక్కువగా చూసింది సిల్క్. ఇక ప్రేమించానని ఒక హీరో మోసం చేసాడు.
ఇక తన ఆప్తుడు అని చెప్పి అప్పట్లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సిల్క్ స్మిత మత్తులో ఉన్నపుడు సంతకాలు చేయించుకుని తన పేరిట మార్చుకున్నాడు. ఇక తన తుది దశలో చనిపోవాలని అనుకున్నపుడు మిగిలిన కొద్దిపాటి ఆస్తులను ఏలూరు లో ఉన్న తన కుటుంబ సభ్యుల పేరిట రాసి చనిపోయింది. తాను ఇబ్బందుల్లో ఉన్నపుడు ఎవరు ఆమెకు సహాయం కూడా చేయకపోవడం బాధాకరం. 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత చెన్నై లోని ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని మరణించింది. సూసైడ్ నోట్ లో నమ్మిన వాళ్ళే మోసం చేసారని తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు రాసింది. సినిమాల్లో పేరు, డబ్బు సంపాదించిన సిల్క్ స్మిత చివరికి వ్యసనాలకు బానిసగా మారి ఇతరుల చేతిలో మోసపోయి చివరకు ఆత్మహత్య చేసుకుని మరణించింది.
ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…
ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…
హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…