Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ కి ఎలాంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఇక ఈయన అందరితో ఎంతో మంచితనంగా ఉంటూ అందరి పట్ల ఎంతో ప్రేమను రాగాలను వ్యక్తపరుస్తుంటారు. ఈ అలవాటు ప్రభాస్ కి తన పెదనాన్న కృష్ణంరాజు నుంచి వచ్చిందని చెప్పాలి.
ఇలా ప్రభాస్ ఎప్పుడు కూడా తన చుట్టూ ఉండే వారికి ఆకలి లేకుండా వాళ్లు కడుపునిండా భోజనం తినేలా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి ఎన్నోసార్లు ప్రస్తావించారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఈయన మంచితనంపై అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణించడంతో పెద్ద ఎత్తున అభిమానులు కృష్ణంరాజు అంత్యక్రియలలో పాల్గొన్నారు. ఇలా తన పెదనాన్న అంత్యక్రియల కోసం వచ్చిన అభిమానుల గురించి ప్రభాస్ ఆలోచించి వారికి భోజనాలు ఏర్పాటు చేయించారు.అంత్యక్రియల అనంతరం ప్రభాస్ అందరూ భోజనం చేసే వెళ్ళండి డార్లింగ్ అంటూ అభిమానులకు తెలియజేశారు.అంత బాధలో ఉండి కూడా ప్రభాస్ ఇలా అభిమానుల గురించి ఆలోచించి వారికి భోజనం చేసి వెళ్ళమని చెప్పడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ క్రమంలోనే ఈ వీడియోని సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేస్తూ నిజం గానే మీమనసు ఎంతో మంచిది అంత బాధలో ఉండి కూడా అభిమానుల గురించి ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉంటారంటూ ఈయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే మరికొందరు రాజు ఎక్కడున్నా రాజే అంటూ ఆ వీడియోని షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక తనని ఎంతగానో ప్రోత్సహిస్తూ తన పట్ల ఎంతో ప్రేమగా ఉన్నటువంటి పెదనాన్న చనిపోవడంతో ప్రభాస్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి కష్ట సమయంలో కూడా ఈయన అభిమానుల పట్ల వ్యవహరించిన శైలి అందరిని ఆకట్టుకుంటుందని చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…