Singer Anitha Nagaraj : 15 సంవత్సరాల తరువాత మీడియా ముందుకు అనితా ఓ అనితా సాంగ్ నాగరాజ్…!

Singer Anitha Nagaraj : 2008 ఆ ప్రాంతంలో యువతను బాగా ఆకట్టుకున్న పాట అనితా ఓ అనితా. ఒక సినిమా పాట కూడా అంత వేగంగా ప్రాచుర్యం పొందదేమో అన్నట్లుగా అనిత అనే పాట ఆకట్టుకుంది. అప్పటికి ఇంకా స్మార్ట్ ఫోన్స్ అంత అందుబాటులో లేకపోయినా ఈ పాట అందరికీ చేరువయింది. అప్పట్లో ఈ పాట ఎవరు రాసారో, ఎక్కడి నుండి ఈ పాట వచ్చిందో ఎవరికీ తెలియక పోయినా ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలో ఆ పాట రాసి పాడిన నాగరాజ్ అందరికీ పరిచయమాయ్యాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాగరాజ్ ఈ పాట స్వయంగా తానే రాసి పాడటం విశేషం. ఇక ఈ పాటకు సంబంధించిన అనేక విషయాలను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో నాగరాజ్ పంచుకున్నారు.

ప్రేమ విఫలమై పాట రూపంలో…

నాగరాజ్ కాలేజీలో చదివే రోజుల్లో తాను ఇష్టపడిన అమ్మాయి అనిత పెద్దల మాటకు ఎదురు చెప్పలేక పెళ్లి చేసుకోవడం వల్ల ఆ బాధ నుండే ఈ అనితా ఓ అనితా పాట పుట్టిందని నాగరాజ్ తెలిపారు. తెలంగాణ ఈటెల రాజేందర్ ఊరు అయిన కమలాపురం పక్కన గ్రామనికి చెందిన నాగరాజ్ ఆ పాటతో బాగా ఫేమస్ అయ్యాడు. ఇంట్లో అందరూ సింగర్స్ ఉన్నారని అయితే సంగీత పరిజ్ఞానం అంతగా లేదంటూ చెప్పిన నాగరాజ్ కు ఒక చెల్లి తమ్ముడు ఉన్నారు. ఆర్కెస్ట్రాలో గాయకుడిగా అనుభవం ఉన్న నాగరాజ్ పాట రాయడం అదే మొదటి సారి.

ఇక ఆ పాట బాగా హిట్ అయ్యాక సీనియర్ నటుడు చరణ్ రాజ్ అనితా ఓ అనితా యధార్థ ప్రేమ కథ పేరుతో సినిమా కూడా నిర్మించారు. అయితే కుటుంబ బాధ్యతల వల్ల తన మ్యూజిక్ కెరీర్ ను అంతగా పట్టించుకోని నాగరాజ్ దాదాపు 15 ఏళ్ల తరువాత హైదరాబాద్ కి వచ్చి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తన తమ్ముడు సాఫ్ట్ వేర్ గా హైదరాబాద్ లో ఉండటంతో ఆతని వద్దే ఉంటూ ప్రయత్నిస్తూ యూట్యూబ్ లో ఒక ప్రముఖ ఛానెల్ అనిత పార్ట్ 2 పేరుతో మ్యూజిక్ చేస్తున్నారు. ఇక భార్య పిల్లలు ఊర్లోనే ఉన్నారని తెలిపిన ఆయన కష్టపడితే ఇండస్ట్రీలో ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago