Featured

Singer B. Vasantha : థమన్ నా కొడుకు… నా భర్త జాబ్ వదిలేసి… కుటుంబాన్ని పోషించలేక… బాలు గారు మరణించినప్పుడు…: సింగర్ బి వసంత

Singer B. Vasantha : బొడ్డుపల్లి బాల వసంత అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తు రాకపోవచ్చు కానీ బి.వసంత అనగానే సింగర్ గా ఆమె పాడిన అలనాటి పాటలు ఎన్నో గుర్తుకు వస్తాయి. ‘చందమామ రావే జాబిల్లి రావే’ అంటూ ఆమె పాడిన పాట ఇప్పటికీ తెలుగు లోగిల్లలో వినిపిస్తుంది. తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, కన్నడ, హిందీ ఇలా సుమారు 8 భాషలలో సుమారు పదివేలకు పైగా పాటలు పాడిన వసంత గారు ఆమె వ్యక్తిగత జీవితం అలానే తన కెరీర్ అప్పటి రోజుల్లో ఎలా రిలేషన్స్ ఉండేవి లాంటి విషయాలను తెలిపారు. ప్రస్తుతం తెలుగులో ఒక ఊపు ఊపుతున్న సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ వసంత గారి సొంత చెల్లి కొడుకు కావడం విశేషం.

బాధ్యతలన్నీ నా మీదే… అప్పట్లో రెమ్యూనరేషన్…

వసంత గారి స్వస్థలం గుంటూరు కాగా తండ్రి మ్యూజిక్ డైరెక్టర్ అలానే ఫోటో గ్రాఫర్. ఇక తల్లి వీణ విద్వాంసురాలు కావడం వల్ల వసంత గారికి సంగీతం, గానం మీద చిన్నపటి నుండే ఆసక్తి వచ్చింది. ఇక సంగీతం నేర్చుకున్న వసంత గారు తండ్రి ప్రోత్సాహంతో చెన్నై లో సినిమాల్లో పాడటానికి వెళ్లారు. ఇక సింగర్ గా సినిమాల్లోను అలానే బయట కచేరిల్లో పడుతూ కుటుంబ బాధ్యత వసంత గారు తీసుకున్నారు. వసంత గారు ఇద్దరు చెల్లెళ్లను చదివించి పెళ్లి చేసాక తాను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. భర్త సుధాకర్ గారు వ్యాపారం చేస్తున్నా వసంత గారి కెరీర్ కోసం హైదరాబాద్ లో వ్యాపారాలను వదిలి చెన్నై కి వచ్చి వసంత గారి షెడ్యూల్ చూసేవారట. ఇక ఎన్నో పాటలు పాడినా అనుకున్నంత గుర్తింపు మాత్రం రాలేదంటూ వసంత గారు బాధపడ్డారు.

మాధవపెద్ది, పెండ్యాల, కే వి మహదేవన్, ఘంటసాల, బాలసుబ్రమణ్యం ఇలా అప్పటి అందరి సింగర్స్ తోనూ అలానే మ్యూజిక్ డైరెక్టర్స్ తోనూ పనిచేసిన వసంత గారు బాలసుబ్రమణ్యం గారి మరణం బాధించిందని ఆరోజు చాలా ఏడ్చానంటూ చెప్పారు. అప్పుడే ఎందుకు వెళ్లిపోయారు, మీరు ఇంకా ఎన్నో పాటలు పాడాల్సి ఉంది అపుడే ఎందుకు పోయారు అని బాగా ఏడ్చానంటూ తెలిపారు. ఇక థమన్ గురించి మాట్లాడుతూ నేను సాధించలేనిది తాను సాధించాడంటూ గర్వపడుతున్నాను అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

ప్రేమించి పెళ్లి… చివరకు భర్త హత్య! హోలోగ్రామ్‌తో బయటపడిన షాకింగ్ కుట్ర

ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…

5 hours ago

అషు రెడ్డి-టెక్కీ వివాదంలో ఆడియో బాంబ్

బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…

5 hours ago

ఒక్క ఛాన్స్ కోసం తిరిగిన సత్యరాజ్.. కట్టప్పగా వరల్డ్ ఫేమ్

దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…

5 hours ago

“ఆ హీరో నా జీవితంలో గాడ్ ఫాదర్”.. అనుష్క ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…

6 hours ago

“వినాశకాలే విపరీత బుద్ధి”.. యువతకు కఠిన హెచ్చరిక

ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…

6 hours ago

మోదీని డైరెక్ట్‌గా కలుస్తా.. మంచు లక్ష్మి రాజకీయ వ్యాఖ్యలు వైరల్

టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…

8 hours ago