Singer Revanth: వాలెంటైన్స్ డే సందర్భంగా ఎంతో మంది సెలబ్రిటీలు వారి లైఫ్ పార్టనర్ తో కలిసి ఎంత వేడుకగా ఈ రోజున జరుపుకున్నారు. కొందరు తమ లైఫ్ పార్ట్నర్స్ కి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వగా మరికొందరు వెకేషన్ లకు వెళుతూ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే సింగర్ రేవంత్ సైతం తన భార్య అన్వితతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లి వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.
రేవంత్ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఇండియన్ ఐడల్ విజేతగా కూడా నిలిచారు. ఇలా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న రేవంత్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలోకి వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన విన్నర్ గా నిలిచి మరెంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే తన భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా తన భార్య డెలివరీ సమయంలో రేవంత్ తన పక్కన లేకపోయానంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన రేవంత్ తన కూతురిని మొదటిసారి చూస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
ఇలా తన కూతురు భార్యతో కలిసి ఎంతో సంతోషంగా ఉన్న రేవంత్ తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా తన భార్యతో కలిసి మాల్దీవ్స్ వెళ్ళినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే వీరి మాల్దీవ్స్ ఫోటోలను రేవంత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఎంతోమంది నేటిజన్స్ క్యూట్ ఫ్యామిలీ, క్యూట్ కపుల్ అంటూ ఈ జంటపై కామెంట్లు కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…