Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులకు ఆయన స్పీచ్ లకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని చెప్పాలి.ఇలా మాటల మాంత్రికుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా ధనుష్ సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సార్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా త్రివిక్రమ్ ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సార్ సినిమా ద్వారా ధనుష్ పూర్తిస్థాయి తెలుగు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ బ్యానర్ పై నాగ వంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. అదేవిధంగా ఈయన నటి సంయుక్త మీనన్ కు ఏకంగా వేదికపై ఐలవ్యూ చెప్పేశారు. ఈ విధంగా త్రివిక్రమ్ హీరోయిన్ కు ఐ లవ్ యు చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులకు ఈలలు కేకలతో హోరెత్తించారు.
ఈ క్రమంలోనే త్రివిక్రమ్ లేదండి బాబు నేను పూర్తిగా చెప్పేది వినండి అంటూ అప్పటికి ఏదో కవర్ చేసేసారు. ఇలా త్రివిక్రమ్ బహిరంగంగా వేదికపై హీరోయిన్ కు ప్రపోజ్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…