Singer Sai chandh wife Rajani : తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళ తన గాత్రంతో వేల మందిని ఉత్తేజపరిచి ఉద్యమ వైపు నడిపిన గొంతు నేడు మూగబోయింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాటలు పాడి తెలంగాణ ధూమ్ ధామ్ అంటూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తు ప్రజలను చైతన్య పరచిన 39 ఏళ్ల సాయి చంద్ గుండెపోటుతో మరణించారు. తెలంగాణ ఉద్యమం తరువాత బిఆర్ఎస్ పార్టీలో చేరి ప్రస్తుతం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన సాయి చంద్ మరణం తీవ్ర విషాదాన్ని మిగల్చింది. చిన్న వయసులోనే ఆయన మృతి ఆయన భార్య, పిల్లలకు తీరని లోటు. నిజానికి సాయి చంద్ గాయకుడయితే ఆయన భార్య రజని నాట్యకారిని. వారిది ప్రేమ వివాహం కావడం విశేషం.
గుండెపోటుతో హాస్పిటల్ లో రజని…
సాయి చంద్ గారు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసేవారు. ఆయన గత వారం కుటుంబంతో కలిసి వ్యవసాయ క్షేత్రంకి వెళ్లగా అక్కడే కార్డియాక్ అరెస్ట్ కావడంతో హాస్పిటల్ లో చేర్చే సమయానికి ఆయన మరణించారు. ఆయన ఆకస్మాతుగా మరణించడంతో ఆయన భార్య రజని గుండె పగిలేలా రోధించారు.
ఆయన మరణాన్ని తట్టుకోలేని ఆమె ఆ రోజు నుండి ఏడుస్తూనే ఉన్నారట. సరిగా ఆహరం తీసుకోక ఒత్తిడికి గురవడం వల్ల గుండె పోటు రావడంతో తాజాగా రజని గారిని హాస్పిటల్ లో జాయిన్ చేసారు. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆమె ఏడుస్తూనే ఉన్నారు. ఆమెను ఓదార్చడం ఎవరి తరము కావడం లేదంటూ బంధువులు బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యజం నిలకడగా ఉంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…