Categories: FeaturedMovie News

Singer Sri krishna: తనకి ఆ అవసరం లేదు ‘ అంటూ యశస్వికి మద్దతుగా నిలిచిన సింగర్ శ్రీ కృష్ణ..?

Singer Sri krishna: సింగర్ గా గుర్తింపు పొందిన యశస్వి కొండేపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ సింగర్స్ షో ద్వారా తెరపైకి వచ్చిన యశస్వి జాను సినిమాలోని లైఫ్ ఆఫ్ రామ్ పాటను అద్భుతంగా పాడి ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు. ఇలా సింగర్ గా గుర్తింపు పొందిన యశస్వి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక షోలో పాల్గొన్న యశస్వి తను చేసిన సేవా కార్యక్రమాల గురించి వెల్లడించాడు.

యశస్వి చేసిన ఆ సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఆ ప్రోమోలో హైలెట్ గా నిలిచాయి. అయితే దీనిపై కాకినాడకు చెందిన నవసేవ ఫౌండేషన్ స్థాపకురాలు అయిన ఫరౌ కౌసర్ స్పందిస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.యశశ్వి తమ ఫౌండేషన్ కి ఎలాంటి సహాయం చేయలేదని, ఎటువంటి సహాయం చేయకపోయినా కూడా సహాయం చేసినట్లు అబద్ధపు మాటలతో తమ ఫౌండేషన్ పేరు వాడుకొని తన ఫేం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇలా యశస్వి మీద వచ్చిన ఈ ఆరోపణలపై తాజాగా సింగర్ శ్రీకృష్ణ స్పందించాడు. ఈ క్రమంలో శ్రీకృష్ణ స్పందిస్తూ.. ” పాపులారిటీ కోసం యశస్వి ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఎందుకంటే యశస్వి ఎన్జీవోలకు పెద్ద మొత్తంలో సహాయం చేయడం నేను స్వయంగా చూశానని శ్రీకృష్ణ వెల్లడించాడు. అంతేకాకుండా సింగర్ గా యశస్వి ఇప్పటికే చాలా పాపులర్ అయ్యాడు. అలాంటిది పబ్లిసిటీ కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయవలసిన అవసరం తనకి లేదు.

Singer Sri krishna: యశస్వికి అలాంటి అవసరం లేదు…

నిజాన్ని తెలిపే బాధ్యత నాపై ఉన్నందున ఈ పోస్ట్ షేర్ చేస్తూ యశస్వికి సపోర్ట్ చేస్తున్నాను” అంటూ శ్రీకృష్ణ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశాడు. ఇక మరొకవైపు యశస్వి కూడా తనపై వస్తున్న ఆరోపణల గురించి స్పందిస్తూ ..” నవసేవ ఫౌండేషన్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆ సంస్థకు నేను సహాయం చేసినట్టు ఎక్కడ ప్రచారం చేయదని” తనపై వస్తున్న ఆరోపణలను ఖండించాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago