Movie News

Chiranjeevi: అవకాశాల కోసం వెళితే అంత అందగాడివా అంటూ హేళన చేసి మాట్లాడారు: చిరంజీవి

Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి మెగాస్టార్ గా తనకంటూ ఒక పదిలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి తన స్వయంకృషితో అంచలంచలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా గుర్తింపు పొంది అందరికీ ఆదర్శంగా నిలిచారు. చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. హీరోగా ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే రాజకీయాలలో ప్రవేశించి సినిమాలకు దూరమయ్యాడు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు.

ఇక ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా చిరంజీవి మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన సోనీలీవ్ లో ప్రసారం అవుతున్న ” నిజం విత్ స్మిత” అనే టాక్ షో లో చిరు గెస్ట్ గా హాజరు అయ్యాడు. ఇటీవల ప్రారంభమైన ఈ టాక్ షోలో చిరంజీవి మొదటి గెస్ట్ గా హాజరయ్యాడు. ఇక ఈ షోలో చిరంజీవి తన సినిమా కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా వెల్లడించాడు.

ఈ క్రమంలో తన కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం వెళితే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చిరంజీవి వెల్లడించాడు. ఈ మేరకు చిరంజీవి మాట్లాడుతూ..” సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లి పాండీబజార్ లోని ఫిలిం ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తి నన్ను చూసి ‘ ఏంటి ఫిలిం ఇన్స్టిట్యూట్లోకి వచ్చావా? సినిమాలు చేద్దామనే.. అతను చూడు ఎంత అందంగా ఉన్నాడో. నువ్వు అతని కంటే అందగాడివా అంటూ చులకన చేసి మాట్లాడాడు. ఇక్కడ అవకాశాలు రావాలంటే తెలిసిన వారు ఉండాలి. అందుకే నీ కల మర్చిపో” అని హేళన చేసి మాట్లాడాడు.

Chiranjeevi: ఆ మాటలు నన్ను బాధ పెట్టాయి..

ఆ వ్యక్తి అన్న మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి. అయితే ఇలాంటి మాటలకు భయపడి ప్రయత్నం ఆపకూడదని ఆ రోజే నిర్ణయించుకున్నాను అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంత కష్టపడాలో అవకాశాలు వచ్చిన తర్వాత వాటిని సద్వినియోగం చేసుకొని గుర్తింపు పొందటానికి కూడా అంతే కష్టపడాలి. చిరంజీవి ఎంతో కష్టపడి అవకాశాలు దక్కించుకొని ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని తన టాలెంట్ తో ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago