Anchor Suma: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా గుర్తింపు పొందిన సుమా కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుమా తర్వాత యాంకర్ గా మారి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ యాంకర్ గా గుర్తింపు పొందింది. ఇక కేరళకు చెందిన ప్రముఖ నటుడు రాజీవ్ కనకాలను వివాహం చేసుకొని హైదరాబాద్ లోనే స్థిరపడిపోయింది.
బుల్లితెర మీద ప్రసారమవుతున్న అనేక టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరించటమే కాకుండా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా సుమతన మాటల చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందువల్ల స్టార్ హీరోలు సైతం ఈమె డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.
ఇదిలా ఉండగా సుమ రాజీవ్ కనకాల వివాహం జరిగి ఇప్పటికీ 24 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఏడాది వీరిద్దరూ కూడా వారి వెడ్డింగ్ యానివర్సరీ చాలా భిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్ కి సంబంధించి సుమ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా సుమా షేర్ చేసిన ఈ వీడియోలో.. ఇద్దరూ వీడియో కాల్ మాట్లాడుతూ ” నువ్వక్కడ.. నేనిక్కడ.. పాటిక్కడ .. పలుకక్కడ.. అని సుమా పాట పాడగా మనసు ఒకటి కలిసున్నది ఏనాడైనా” అంటూ రాజీవ్ పాట పాడాడు.
ఇలా వీరు ఒకరికి ఒకరు దూరంగా ఉన్నా కూడా మానసికంగా వీరిద్దరూ ఒకటేనని మరొకసారి రుజువు చేశారు. ఇక గతంలో సుమ రాజీవ్ కనకాల విడాకులు తీసుకోబోతున్నారు అంటూ చాలా సార్లు వార్తలు వైరల్ అయ్యాయి. కెరీర్ పరంగా రాజీవ్ కనకాల కన్నా సుమ మంచి స్థాయిలో ఉంది. అందువల్ల రాజీవ్- సుమ మధ్య గొడవలు మొదలై వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై రాజీవ్ స్పందిస్తూ తమ విడాకుల గురించి వచ్చే వార్తలలో నిజం లేదని స్పష్టం చేశాడు. ఇక తాజాగా 24 సంవత్సరాల వారి వైవాహిక బంధాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సుమ, రాజీవ్ కనకాల ఇద్దరు పాట పాడుతూ తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి మరొకసారి ప్రూవ్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…