Hansika: దేశముదురు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటిసారిగా హన్సిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హన్సిక అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ అమ్మడికి తెలుగులో వరుస అవకాశాలు దక్కాయి. ఇలా స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు రావడంతో తమిళ్ ఇండస్ట్రీలో కూడా మంచి మంచి అవకాశాలు అందుకుంది.
తెలుగు తమిళ్ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే హన్సికకి ఆమె అభిమానులు గుడి కట్టించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ప్రస్తుతం హన్సిక తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమై కేవలం తమిళ సినిమాలలో మాత్రమే నటిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల సోహైల్ కతూరియా అనే వ్యాపారవేత్తను హన్సిక వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తన స్నేహితుడైన సోహెల్ ని హన్సిక ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంది.
ఇటీవల వీరి వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇక హీరోయిన్ నయనతార బాటలోనే హన్సిక కూడా తమ వివాహ వేడుకను లవ్ షాది డ్రామా పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేసింది. ఈ క్రమంలో తన పెళ్లికి ముందు జరిగిన సంఘటనల గురించి హన్సిక వెల్లడించింది..హన్సిక తన పెళ్లి జరిగే వరకు వారి బంధం గురించి బయటపడకుండా చాలా సీక్రెట్ గా ఉంచాలని అనుకుంది కానీ. ఎలాగో ఈ మేటర్ మీడియాకి లిక్ అయింది. దీంతో అసహనానికి గురైనట్లు తెలిపింది.
తన తల్లి, సోదరుడి సలహా మేరకు ప్యారిస్లో సోహెల్ తనకు ప్రపోజ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ బంధాన్ని అఫీషియల్ గా ప్రకటించినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత పెళ్లికి కొన్ని రోజుల ముందు సోహైల్ కి గతంలోనే మరొకరితో వివాహం అయ్యిందని వార్తలు ప్రచారం చేశారు. అంతే కాకుండా అతను తన భార్యతో విడిపోవడానికి నేనే కారణం అని రాశారు. అయితే అతని గతం గురించి నాకు తెలుసు. కానీ అతని విడాకులకు నాకు ఏం సంబంధం లేదు. వారి విడాకులకు నేనే కారణం అని వచ్చిన ఆ వార్త నన్ను చాలా బాధ పెట్టింది ” అంటూ హన్సిక చెప్పుకొచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…