Featured

Singer Srivardhini : పెళ్లి తరువాత ఆరేళ్ళ గ్యాప్… ఇంట్లో అలా ఉండరు… కొడుకు పుట్టాక…: గాయని శ్రీవర్థిని

Singer Srivardhini : ప్రస్తుతం హీరోలకు, దర్శకులకు మ్యూజిక్ డైరెక్టర్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు థమన్. ప్రస్తుతం సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా థమన్ కొనసాగుతున్నారు. సినిమాలలో థమన్ ఇచ్చే పాటలే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా ఆదరగొడుతున్నాడు. సినిమాలు విజయం సాధించడానికి థమన్ పాత్ర కూడా ఉంటుంది అనడంలో అతిషయోక్తి లేదు. కెరీర్లో ఇంత విజయం సాధించిన థమన్ వ్యక్తిగత జీవితంలో ఇద్దరి మహిళల ప్రోత్సహం ఆయన విజయలకు కారణం. మొదట ఆయన తల్లి సావిత్రి కాగా రెండోది ఆయన భార్య ప్రముఖ గాయని శ్రీవర్థిని. శ్రీవర్థిని గారు థమన్ ను పెళ్లి చేసుకునే సమయానికి అప్పటికే మంచి సింగర్ గా పేరు తెచ్చుకున్నారు. అయినా ఆమె కెరీర్ ను పక్కన పెట్టి ఇంటి బాధ్యతలను తీసుకోవడం వల్లే థమన్ ఇంత సక్సెస్ అయ్యారు. ఇక సింగర్ శ్రీ వర్ధిని గారు మీడియాలో పెద్దగా కనిపించరు. తాజాగా ఒక యూట్యూవలబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

మా పెళ్లి అలా జరిగింది…

తెలుగులో వర్ధిని స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ‘ఒకరికి ఒకరై’ సాంగ్ తో మంచిపేరు తెచ్చుకోగా రీసెంట్ గా వచ్చిన విశాల్ టమ్ టమ్ సాంగ్ తో మరింత ఫేమస్ అయ్యారు. అయితే థమన్ గారి పెద్దమ్మ గాయని వసంత గారి వల్ల థమన్ గారి సంబంధం రావడం ఇంట్లో పెద్దలు మాట్లాడుకుని పెళ్లి చేయడం జరిగిందని శ్రీవర్థిని గారు ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రేమ వివాహం కాదని పూర్తిగా పెద్దలు కుదుర్చిన వివాహం అంటూ చెప్పారు. ఇక థమన్ గారు పెళ్ళైన రెందేళ్ళకే మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టారు. ఇక అప్పటి నుండి నేటి వరకు బాగా బిజీగా ఉన్నారు. మొదట్లో బాబు వద్ద ఉండేవారు.

ఇక ఇప్పుడు బాగా బిజీ అవడం వల్ల కుదరడం లేదు. పెళ్ళైన 6 ఏళ్ళు నేను సొంగర్ గా పాటలను పాడలేదు. ఇంట్లో ఎవరూ ఆంక్షలను పెట్టకపోయినా బాబు పుట్టాక వాడితోనే సమయం గడిపాను. ఆరేళ్ళ తరువాత మళ్ళీ తమిళ పాటతో కెరీర్ రీస్టార్ట్ చేశానంటూ వర్ధిని తెలిపారు. ఇక థమన్ ఇంటికి వస్తునానరంటే మొదట చెప్పేది ఇంట్లో మొత్తం ఏసీ పెట్టమని బాగా చల్లగా ఉండాలి తనకు ప్రశాంతంగా ఉండాలని అనుకుంటాడు. ఇక ఫుడ్ చెప్తాడు ఏది కావాలో అంటూ వర్ధిని తెలిపారు. ఇక బాబు ప్రస్తుతం +2 చదువుతున్నాడని తనకు సంగీతంలో ప్రావీణ్యం ఉన్నా మొదట చదువు అయ్యాక సంగీతం వైపు రావాలని చెప్పానని వర్ధిని తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago