టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని వందల పాటలను పాడి తన మధురమైన గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకున్న సింగర్ సునీత ఈ ఏడాది మొదట్లో రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.రెండవ వివాహం చేసుకున్న తర్వాత సునీత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకునే వారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సునీతకు ఎంతోమంది అభిమానులు అయ్యారు.
రెండవ వివాహం తర్వాత ఇటు కుటుంబ పరంగా అటు వృత్తి పరంగా ఎంతో బిజీగా మారిన సునీత తాజాగా తన భర్తతో కలిసి వ్యాపార రంగంలోకి రావడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. సునీత భర్త రామ్ మ్యాంగో మీడియాతో పాటు మరికొన్ని డిజిటల్ ఛానళ్లకు అధిపతిగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే తన బిజినెస్ మరింత డెవలప్ చేయడం కోసం తన భార్య సింగర్ సునీతను సహాయం కోరినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సునీత తన భర్త రామ్ తో కలసి మ్యాంగో బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ వెబ్ సిరీస్‌ల బాధ్యత మొత్తం రామ్ సునీతకు అప్పగించినట్లు తెలుస్తోంది. నటీనటులను ఎంపిక చేసి వారిని ప్రోత్సహించే దగ్గర నుంచి నిర్మాణ బాధ్యతలను కూడా సునీత తీసుకోనుంది.
ప్రస్తుత కాలంలో డిజిటల్ మీడియాకు ఎంతో డిమాండ్ పెరగడంతో ఈ విధంగా సునీత బిజినెస్ రంగం వైపు అడుగు వేయడం మంచి నిర్ణయం అని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…