‘నువ్వే కావాలి’ చిత్రం అప్పట్లో ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రంలో సెకండ్ హీరో ప్రకాష్ పాత్రలో నటించి టాలీవుడ్ కు పరిచయమయ్యాడు సాయి కిరణ్.
ఇతను ప్రముఖ సింగర్.. పి.సుశీల గారి మనవడు అన్న సంగతి చాలా మందికి తెలీదనే చెప్పాలి. ‘నువ్వే కావాలి’ చిత్రం తరువాత ‘ప్రేమించు’ ‘మనసుంటే చాలు’ ‘ఎంత బావుందో, రావే నా చెలియా’ వంటి చిత్రాల్లో నటించాడు సాయి కిరణ్. కానీ అవేమీ హిట్ అవ్వకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారి ‘జగపతి’ ‘షిరిడి సాయి’ ‘నక్షత్రం’ ‘గోపి గోడమీద పిల్లి’ వంటి చిత్రాల్లో నటించాడు. టాలీవుడ్ లో నిలద్రొక్కుకోలేక ఇక బుల్లితెరపైన తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో భాగంగా ‘కోయిలమ్మ’ వంటి సీరియల్స్ లో కూడా నటించాడు.
ఇక అసలు విషయానికొస్తే.. సాయి కిరణ్ తన కుటుంబం కోసం తాను ఎంతో ఇష్టంగా ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకున్నాడట. కెరీర్ ప్రారంభంలో సాయి కిరణ్ తో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ తోనే ప్రేమ వ్యవహారం నడిపాడని ఫిల్మ్ నగర్ టాక్.. కానీ సినిమాలలో చూసినట్టుగానే రియల్ లైఫ్ లో కూడా సాయికిరణ్ కుటుంబ సభ్యులకు ఆ హీరోయిన్ ను.. సాయి కిరణ్ కు ఇచ్చి పెళ్ళి చెయ్యడం ఇష్టం లేదట. కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నాలు చేసినా.. ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదని. ఇక వారిని నొప్పించడం కూడా ఇష్టం లేక.. తాను ప్రేమించిన ఆ హీరోయిన్ ను దూరం చేసుకున్నాడని ఈమధ్యనే ఓ ఇంటర్వ్యూలో సాయి కిరణ్ చెప్పిన మాటలను బట్టి అర్ధమైంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఈపాటికి మీకూ అర్ధమైందనుకుంటాను..!
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…