Singer Sunitha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ సింగర్స్ గా గుర్తింపు పొందిన వారిలో సునీత కూడా ఒకరు. కొన్ని వందలకు పైగా పాటలు పాడి తన మధురమైన గాత్రంతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న సునీత సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న సింగింగ్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది.
ఇలా కెరీర్ పరంగా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న సునీత వ్యక్తిగత విషయాల వల్ల కొన్ని సందర్భాలలో విమర్శలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా రెండవ వివాహం చేసుకోవడంతో సునీత మీద విమర్శలు గుప్పిస్తున్నారు. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని సునీత రెండవ వివాహం చేసుకోవడంతో కొంతమంది ఆమెను విమర్శిస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం సునీత చేసిన పనిని సపోర్ట్ చేస్తున్నారు.
సునీత తన మొదటి భర్తకు దూరమైన చాలాకాలం తర్వాత ఇటీవల రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సునీత తన పిల్లలు, కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఈ పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. అయినప్పటికీ కొంతమంది ఇప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఆమె గురించి వివిధ రకాలుగా విమర్శిస్తూ ఆమెని బాధపెడుతున్నారు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత తాను రెండవ వివాహం చేసుకోవడానికి గల కారణాల గురించి వెల్లడించింది.
ఈ ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ ” నా జీవితంలో జరిగే సంఘటనల గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ సోషల్ మీడియాలో ఇష్టమొచ్చిన రూమర్స్ క్రియేట్ చెయ్యడం వల్ల మేము చాలా బాధపడుతున్నాము. నా మొదటి భర్తతో విడిపోయిన తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం నేను ఎన్నో కష్టాలను అనుభవించాను. ఆ సమయంలో ఒంటరితనం కనిపించలేదు. కానీ ఇప్పుడు నా జీవితం మొత్తం పోయినట్టుగా అనిపించింది, ఆ సమయంలో రామ్ నాకు పరిచయ అయ్యాడు, స్నేహితులం అయ్యాం. పిల్లల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నాము ” అంటూ తాను రెండవ పెళ్లి చేసుకోవడానికి గల కారణం గురించి చెప్పుకొచ్చింది .
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…