Singer Vijayalakshmi : దేవదాస్ సినిమాలోని ‘మాయదారి చిన్నోడు మనసే లాగేసిండు’ పాటతో బాగా పాపులర్ అయిన విజయలక్ష్మి గారు సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. ఆమె తల్లిదండ్రులు కూడా గాయకులే. ఇక విజయలక్ష్మి కూడా కర్ణాటక సంగీతం నేర్చుకుంది అలాగే హిందూస్థాని సంగీతం కూడా నేర్చుకుంది. 25 సంవత్సరాల నుండి దాదాపు ఎన్నో వేల పాటలు పాడిన విజయలక్ష్మి గారు పలు ఈవెంట్స్ లో పాటలు పడుతూ మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె కెరీర్ గురించి నేటి సింగర్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
సునీత నాకు బంధువు… బాలుగారి రెమ్యూనరేషన్ ఎంతంటే…
టాప్ సింగర్స్ లో ఒకరైన సునీత గారు విజయలక్ష్మి గారికి దూరపు బంధువేనట. ఆమెతో తనకు ఎలాంటి విబేధాలు ఇపుడు లేవని తెలిపారు. ఇక సింగర్స్ రెమ్యూనరేషన్స్ గురించి మాట్లాడుతూ సింగర్స్ పెద్దగా రెమ్యూనరేషన్స్ పట్టించుకోరని ఒక పాట హిట్ అయితే మంచి పేరుతో పాటు ఒక మూడేళ్లపాటు అవకాశాలు ఉంటాయి.
చరిత్రలో ఆ పాట పాడిన సింగర్ గా పేరు ఉండిపోతుంది. ఇక డబ్బు ఈవెంట్స్ ద్వారా బాగా సంపాదించుకోవచ్చు. అలాంటప్పుడు రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేయాల్సిన పనిలేదు. అప్పట్లో బాలసుబ్రమణ్యం గారు లక్ష రూపాయలు పాటకు తీసుకునేవారు. ఇప్పటికీ రెమ్యూనరేషన్ హైయెస్ట్ అంతే ఉండొచ్చు అంటూ చెప్పారు. ఒక పాటకు ఇరవై ఐదు వేలు తీసుకున్నా అది మంచి రెమ్యూనరేషన్ కిందకే వస్తుంది అంటూ విజయలక్ష్మి చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…