Sisindri Movie : సంవత్సరం వయస్సులోనే నాలుగు అవార్డులు కొల్లగొట్టిన అఖిల్.. కానీ బాలల హక్కుల సంఘం నుంచి అమలకు నోటీసులు.!

Sisindri Movie : అక్కినేని మూడవ తరం వారసుడు అఖిల్ ప్రధాన పాత్రలో 1995 లో సెప్టెంబర్ 14 న ప్రేక్షకులకు ముందుకు వచ్చింది సిసింద్రీ సినిమా. అయితే అప్పటిలో ఈ సినిమా ఒక ఏడాది బాబుతో తీయడం ఒక సాహసం అనే చెప్పుకోవాలి. మొదట దర్శకుడు శివ నాగేశ్వర రావు ఇంగ్లీష్ సినిమా అయిన బేబీస్ డే ఔట్ సినిమా చూసి ఇలాంటి సినిమా తెలుగులో తీయాలని తన గురువు అయిన ఆర్జీవీ ని అడుగగా, ఆయన కూడా ప్రోత్సహించడం తో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారట.

నాగార్జున ఫ్యామిలీ ఫోటో చూసి అఖిల్ తో ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని దర్శకుడు మొదట అమల ను కలువగా తిరస్కరించిందట, తరువాత ఘరానా మొగుడు షూటింగ్ లో వున్న నాగార్జున ను కలవగా ఆయన ఓకే చేసి, ఈ సినిమా మీద వచ్చే లాభంతో బ్లూ క్రాస్ సొసైటీ బిల్డింగ్ కొందామని మాట ఇవ్వగా అమల ఒప్పుకున్నారట. తన కొడుకు మొదటి సినిమా కాబట్టి నాగార్జున నేను కూడా ఈ సినిమాల్లో నటిస్తానని చెప్పడం, అంతే కాకుండా ఈ సినిమాకు రెమ్యూనరేషన్ వద్దనడం విశేషం. ఈ సినిమా కథను సూర్యదేవర రామ్మోహనరావు అందించారు. మార్టూరి రాజా డైలాగ్స్ అందించగా రాజ్ సంగీతం అందించారు. ఇక అమల ను తల్లి పాత్రలో నటించమని అడుగగా తను నో చెప్పడం ఆమని ని తీసుకున్నారు.

బాలల హక్కుల సంఘం నుంచి నోటీసులు……

ఆఖరికి 1995 మే నెలలో నాగేశ్వర రావు చేతులమీదుగా ఈ సినిమాని ప్రారంభించారు. అయితే చాలా సన్నివేశాలలో అఖిల్ చిన్న పిల్లవాడు కావడం తో ఆమని శరత్ బాబు లు కనిపించకుండా నాగార్జున అమలతో చిత్రీకరణ జరిపారట. ఏడది బాబుతో సినిమా తీయించినందుకు అమల కు బాలల హక్కుల సంఘం నుండి నోటీసులు కూడా అందాయట. కాకపోతే తరువాత అవి వీగిపోయాయి. ఏడాది వయసు వున్న పిల్లాడితో ప్రధాన పాత్రలో సినిమా రావడం, థియేటర్ ల దగ్గర ఆ బాబుకి కటౌట్ లు పెట్టడం అదే మొదటిసారి. నిజాంలో ఈ సినిమా మొదటివారం 31 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. 34 కేంద్రాలలో 50 రోజులు, 7 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. మరో విశేషం ఏమిటంటే అఖిల్ కు ఈ సినిమాలోని నటనకు నాలుగు సంస్థలు అవార్డులు ఇవ్వడం జరిగింది. సిసింద్రీ సినిమా అప్పటిలో పిల్లలు అందరికి నచ్చిన సినిమా అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.