Sitara: ఘట్టమనేని వారసురాలుగా సితార ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.సితార ప్రస్తుతం 11 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నప్పటికీ ఈమె హీరోయిన్స్ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇక సితార ఇంత చిన్న వయసులోనే ఓ నగల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ యాడ్ చేయడం కోసం సితార ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఇకపోతే సితార ఈ యాడ్ కి సంబంధించిన ఫోటోలను ఏకంగా టైం స్క్వేర్ పై ప్రదర్శించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ విధంగా సితార ఇంత చిన్న వయసులోనే ఇలాంటి క్రేజ్ సొంతం చేసుకోవడం వెనుక తన తల్లి నమ్రత కృషి ఎంతో ఉంది. ఆమె తన కూతురిని అన్ని విధాలుగా అన్ని విషయాలలోనూ ఎంతో చక్కగా తీర్చి దిద్దుతున్నారు.అయితే సితారకు ఉన్నటువంటి ఫాలోయింగ్ చూస్తే ఈమె త్వరలోనే సినిమాలలోకి రాబోతుందని అందరూ భావిస్తున్నారు. కానీ సినిమాలు సితార మొదటి ఛాయిస్ కాదని తెలుస్తోంది.
ఈమె టార్గెట్ మరొకటని ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసమే ఈమె తల్లి ఎంతో కృషి చేస్తున్నారని తెలుస్తోంది. మరి సితార మెయిన్ టార్గెట్ ఏంటి అనే విషయానికి వస్తే ఈమె మిస్ యూనివర్స్ పోటీలకు ఇప్పటినుంచి సిద్ధమవుతున్నారని అదే తన మెయిన్ టార్గెట్ అని తెలుస్తుంది.ప్రస్తుత 11 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి సితార ఈ పోటీలలో పాల్గొనాలంటే మరికొన్ని సంవత్సరాలు వేచి ఉండాలి ఇలాంటి పోటీలలో పాల్గొనాలంటే ఎంతో శిక్షణ అవసరం కనుక సితార ఇప్పటినుంచి ఆ పోటీలకు శిక్షణ తీసుకుంటుందని అనంతరం ఈమె హాలీవుడ్ బాలీవుడ్ సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…