తనను కొంతమంది మోసం చేశారంటూ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ స్నేహ పోలీసులకు ఆశ్రయించారు. ఈ మేరకు వాళ్లపై ఫిర్యాదు చేశారు. టాలీవుడ్ లో ఎంతో మంది అగ్రహీరోలతో నటించిన స్నేహ.. కోలీవుడ్ నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
వివాహం తర్వాత ఆమె ఫుల్ హీరోయిన్ గా కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వస్తున్నారు. దాదాపు సినిమాలకు దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల చెన్నైలోని ఓ ఎక్స్‌పోర్ట్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలకు రూ. 26 లక్షలు అప్పుగా ఇచ్చింది.
అప్పు తీసుకునే సమయంలో వాళ్లు వెంటనే ఇస్తామని చెప్పారని.. కానీ ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదని.. ఈ విషయంలో వాళ్లు తనను మోసం చేశారంటూ ఆమె ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వమని అడిగినందుకు వాళ్లు తనపైనే దాడికి దిగారని.. బెదిరింపులకు పాల్పడతున్నారని ఆమె తెలిపింది. అలాగే తాను ఇచ్చిన రూ. 26 లక్షలు తిరిగి ఇచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారని స్నేహా తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం.
వాళ్లపై చర్యలు తీసుకోవడంతో పాటు.. ఎలాగైనా వారివద్ద నుంచి డబ్బులు వసూలు చేయించాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. సీనియర్ నటి స్నేహ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని.. విచారణ చేపడుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…