Sobhan Babu : లెజెండ్ డైరెక్టర్ దాసరి నారాయణరావు దర్శకుడిగా పరిచయం చేసిన సినిమా ‘తాత మనవడు’ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని కె. రాఘవ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. అయితే ఈ చిత్రం దాసరికి.. రాఘవకు తొలి సినిమా. 1973లో వచ్చిన ఈ సినిమాలో టైటిల్ రోల్స్‌ను ఎస్వీ రంగారావు, రాజబాబు పోషించారు. అయితే ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇక్కడ రాజబాబు క్యారెక్టర్‌ను శోభన్‌బాబు చేయాల్సి ఉంది.
కానీ.. ఆ పాత్రను రాఘవ ఆఫర్ చేసినప్పుడు శోభన్‌బాబు చెయ్యనని చెప్పారంట. డైరెక్టర్ కొత్తవాడు కావడంతో సినిమాను వదులుకున్నాడంట. అంతేకాకుండా తనతో ఎక్స్‌పెరిమెంట్ చేయొద్దని కూడా అన్నారంట. మరో సినిమాను చేద్దాంలే అని ఆ సినిమా నుంచి తప్పించుకున్నాడంట. సినిమా పెద్ద హిట్ కావడంతో దాసరిని తక్కువ అంచనా వేసినందకు శోభన్ బాబు అప్పట్లో బాధపడ్డాడు.
ఆ తరువాత నుంచి దాసరి నుంచి ఏ ఆఫర్ వచ్చినా ఎప్పుడూ వెంటనే కాదని చెప్పలేదంట. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘బలిపీఠం’ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ తరువాత వచ్చిన ‘గోరింటాకు’ మరింత హిట్ తీసుకొచ్చింది.
ఆ తర్వాత వీరిద్దరి మధ్య అభిమన్యుడు, దీపారాధన, కృష్ణార్జునులు, స్వయంవరం, ధర్మపీఠం దద్దరిల్లింది వంటి చిత్రాలు వచ్చాయి. అప్పటి నుంచి ఏ సినిమాను కాదని అనకుండా ఎన్నో సినిమాలను చేశారు. ఇద్దరు ఒకరినొకరు “బావా బావా” అనుకునేంత సన్నిహితత్వంగా ఉండేవారు. వాళ్లిద్దరు సెట్ లో ఉంటే ఎంతో సరదాగా ఉండేవారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…