Sobhita Dhulipala: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పేర్లలో నటి శోభిత పేరు ఒకటి.ఈమె పలు సినిమాలు సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా నటుడు నాగచైతన్యతో రహస్యంగా ప్రేమ ప్రయాణం నడిపిస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇక వీరిద్దరూ కలిసి లండన్ రెస్టారెంట్లో కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని పలువురు భావిస్తున్నారు.
ఇలా తమ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలను నాగచైతన్య లేదా శోభిత కానీ ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇకపోతే తాజాగా శోభిత సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. మెహందీ ఫంక్షన్ ఎన్నో కొత్త ముఖాలు ఇప్పుడే ఒకరినొకరు చూసుకుంటున్నాయి. నేను మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు నా బెస్ట్ ఫ్రెండ్ కూడా రెడీ అవ్వకుండా నాకు తోడుగా ఉంది.
ఇక నేను తారా కన్నాలా మారిపోయి మెహేంది ఫంక్షన్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూసుకుంటున్నాను. అందుకే ముస్తాబ్ అవ్వడానికి సమయం లేకుండా పోయింది. ఇక పెళ్లి మండపంలో సమంతను పెళ్లికూతురుగా చూసేసరికి తనకు ఏడుపు వచ్చింది.ఇక ఇక్కడ మెహేంది పెట్టడం కుదరలేదు కానీ లంచ్ మాత్రం అద్భుతంగా ఉంది అంటూ పెళ్లి మండపం ఫోటోలను షేర్ చేశారు.
ఇకపోతే సంగీత్ గురించి కూడా ఈమె మరొక పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో తన స్నేహితుల బంధువులతో కలిసి పెద్ద ఎత్తున సందడి చేసినట్లు ఈమె తెలియజేశారు. ఇలా సంగీత్ ఫోటోలను కూడా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇవి చూసినటువంటి నెటిజెన్స్ ఈమె ఏదైనా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారా లేకపోతే ఏదైనా పెళ్ళికి వెళ్ళారా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇక ఈమె ట్యాగ్ చేసిన సమంత ఎవరా అని ఆరా తీస్తే ఆమె ఒక డాక్టర్ అని తెలుస్తోంది. ఇలా స్నేహితురాలు పెళ్లిలో ఈమె చేసిన సందడి గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…