Social Activist Krishna kumari : వీర సింహా రెడ్డి సక్సెస్ మీట్ లో నోరు జారి లెజెండ్రీ నటుల గురించి తప్పుగా మాట్లాడటంతో బాలకృష్ణ చిక్కిళ్ళో పడ్డాడు. ఆరోజున విషయం సైలెంట్ గానే ఉన్నా సోషల్ మీడియా పుణ్యమా అని వీడియో వైరల్ అవడంతో ఇప్పుడు అక్కినేని ఫాన్స్ నుండి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది. క్షమాపణ కూడా చెప్పలేదంటూ బాలయ్య మీద అక్కినేని ఫాన్స్ ఫైర్ అవుతుండగా ఇదే ఇష్యూ మీద సామాజిక వేత్త కృష్ణ కుమారి మాట్లాడారు.
బాలయ్య ఒత్తిడిలో ఉన్నాడు…
సామాజిక వేత్త కృష్ణ కుమారి మాట్లాడుతూ టంగ్ స్లిప్ అవ్వడం కామన్ కానీ సెలబ్రిటీలు అందునా అగ్ర నటుడుగా ఉంటున్న బాలకృష్ణ ఇలా సీనియర్ నటులను మాట్లాడటం బాగోలేదు. అయితే ఫ్లోలో అలా ఆ రంగారావు ఈ రంగారావు, అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడాడు కానీ కావాలని అన్నవి కాదు అంటూ చెప్పారు. అయితే బాలకృష్ణ అఖండ సినిమా నుండి వరుసగా సక్సెస్ చూస్తున్నారు, అలానే ఒకవైపు రాజకీయాల్లో టెన్షన్స్ ఉన్నాయి వాటివల్ల ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది.
సాధారణంగా బాలకృష్ణ అలా ఎదుటి వారికి గౌరవం ఇవ్వకుండా అందులోనూ తన తండ్రితో సమకాలిన నటులకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడరు. ఆయన చాలా చిన్న స్థాయి వ్యక్తులను కూడా బాగా పలకరించడం, బసవతారకం హాస్పిటల్ లో నేనే స్వయంగా చూసాను అంటూ చెప్పారు కృష్ణ కుమారి. ఇక ఈ విషయంలో అక్కినేని వారసులు స్పందించిన తీరు చాలా బాగుంది, సమయస్ఫూర్తితో చక్కగా మాట్లాడారు అంటూ చెప్పారు.
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…
ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…