Categories: FeaturedMovie News

Director Kondanda Ramireddy : బాలకృష్ణ తో 13 సినిమాలను చేశాను… అన్ స్టాపబుల్ కి పిలిచి నన్ను ఎలా చూసుకున్నాడంటే…: డైరెక్టర్ కోదండ రామిరెడ్డి

Director Kodanda Ramireddy : కమర్షియల్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ గా ఒకే హీరోతో దాదాపు 17 సినిమాలను మరో హీరోతో దాదాపు 13 సినిమాలు ఇలా వరుసగా పెద్ద హీరోలతో సినిమాలను తీస్తూ ఇద్దరు పెద్ద హీరోలకు వరుస హిట్లను ఇచ్చిన డైరెక్టర్ కోదండ రామిరెడ్డి. నెల్లూరు జిల్లాకు చెందిన కోదండ రామిరెడ్డి హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి రచయితగా పనిచేసి అలానే డైరెక్టర్ గా మారారు. ఆయన డైరెక్టర్ గా ‘సంధ్య’ సినిమా తీశారు. ఇక చిరంజీవి ‘న్యాయం కావాలి’ నుండి ‘ముఠా మేస్త్రి’ వరకు వీళ్ళ జర్నీ నడిచింది. చిరంజీవికి తొలి సూపర్ కమర్షియల్ సక్సెస్ ‘ఖైదీ’ నుండి ముఠా మేస్త్రి వరకు దాదాపు 17 సినిమాలను తీసి అందులో దాదాపు అన్నీ హిట్లుగా నిలిపిన ఘనత కోదండ రామిరెడ్డికి దక్కుతుంది. ఇక బాలకృష్ణ కెరీర్ లో ‘నారీ నారీ నడుమ మురారీ, భార్గవ రాముడు, బొబ్బిలి సింహం’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ఆయన చివరగా కొడుకు వైభవ్ రెడ్డి ని పెట్టి ‘గొడవ’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు.

బాలకృష్ణ అలా చూసుకున్నాడు…

ఇద్దరు అగ్రహీరోలకి కమర్షియల్ సక్సెస్ లు ఇచ్చిన కోదండ రామిరెడ్డి గారు వారి గురించి మాట్లాడుతూ ఇద్దరూ చాలా బాగా గౌరవం ఇస్తారంటూ చెప్పారు. ఇక బాలకృష్ణ తో 13 సినిమాలను చేసిన ఆయన బాలయ్య గురించి మాట్లాడుతూ బాలకృష్ణ చాలా బాగా మాట్లాడుతాడని, గౌరవంగా చూసుకుంటాడని చెప్పారు.

ఇటీవలే అన్ స్టాపబుల్ షో కి వచ్చిన కోదండ రామిరెడ్డి గారు ఆ షో గురించి మాట్లాడుతూ అక్కడ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడని, బాగా చూసుకున్నాడంటూ చెప్పారు. చిరంజీవి, బాలకృష్ణ తో మల్టీ స్టార్రర్ తీయాలానే కోరిక ఉండేదని, ఇప్పటికీ వాళ్లిద్దరు ఓకే అంటే ఖచ్చితంగా సినిమా కథ రెడీ చేసుకుని తీస్తానంటూ ఆ ఎనర్జీ నాలో ఉందంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago