Social Activist Krishna kumari : మంచు మోహన్ బాబు క్రమశిక్షణకు మారుపేరు నేను అంటూ మాట్లాడుతుంటారు. అలాంటి ఆయన ఇంట్లోనే ఆస్థి గొడవలు రోజుకో టర్న్ తీసుకుంటూ మీడియాకు మంచి బ్రేకింగ్ న్యూస్ లా మారిపోయింది. మంచు మనోజ్, విష్ణు ల గొడవ తారస్థాయికి చేరి ప్రస్తుతం పోలీసులు, కోర్ట్ కూడా వీరి ఆస్థి గొడవల్లోకి ఎంటర్ అయ్యారు. ఆ మధ్య గొడవలు సద్ధుమణిగినట్లే అనిపించినా మళ్ళీ మనోజ్ కార్లను ఎత్తుకెళ్లారు అంటూ మనోజ్ మీడియా ముందుకి రావడంతో వివాదం మొదలయింది. ఇక ఈ విషయం గురించి సామజిక వేత్త కృష్ణ కుమారి గారు తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడారు.
దాసరి గారు ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు….
మోహన్ బాబు గారు తన గురువు అంటూ దాసరి నారాయణరావు గారి మాటకు విలువ ఇస్తారు. ఐతే దాసరి గారి మరణం తరువాత చాలా వివాదాల్లో ఆయన లేని లోటు ఏంటో అందరికి తెలిసింది. తాజాగా మంచు మోహన్ బాబుగారి ఇంట్లో గొడవ విషయంలో కూడా ఇండస్ట్రీ లోని పెద్దలు ఎవరు పట్టించుకోకపోవడంతో దాసరి గారు ఉంటే ఇలా ఉండేది కాదని అన్నారు సామజిక వేత్త కృష్ణ కుమారిగారు. మోహన్ బాబు గారు ఎవరి మాట వినరు, అడిగి కాదనిపించుకోవడం ఎందుకని ఎవరిని మనోజ్ కలవలేదనుకుంటా అంటూ వివరించారు.
రజనీకాంత్, రవిరాజా పినిశెట్టి వంటి వారు మెహన్ బాబు కు సన్నిహితులే అయినా మోహన్ బాబు ఎంత వరకు వారి మాటకు గౌరవం ఇస్తారో తెలియక తెలుగు ఇండస్ట్రీ లో వాళ్ళు కూడా ఎవరు ఈ విషయం పట్టించుకోవడం లేదు. అది కాకా మన తెలుగు ఇండస్ట్రీ లో ప్రస్తుతం అందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉన్నారు. వాళ్ళ ప్రైవేట్ సామ్రాజ్యం వాళ్ళు, వాళ్ళ పనులు పక్కవాళ్ళ గురించి ఆలోచించడం మానేసారు. అదే దాసరి గారు ఉండి ఉంటే మనోజ్ ను అడగకపోయినా ఫోన్ చేసి పిలిచి మరి మాట్లాడి సర్ది చెప్పిండేవారు అంటూ కృష్ణ కుమారి గారు తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…