Movie News

Actor Kamal Kamaraju : పిచ్చి కాకపోతే ఆర్ట్ డైరెక్టర్స్ తో ఇల్లు కట్టించుకోవడం ఏంటి : నటుడు కమల్ కామరాజు

Actor Kamal Kamaraju : అర్కిటెక్, రచయిత, నటుడు అయిన కమల్ కామరాజు సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి ప్రేరేపించిన సినిమా చంద్రశేఖర్ ఏలేటి గారి ఐతే సినిమా. ఆ సినిమా చూసి ఆయనను కలవడం అలా అందాల రాక్షసి సినిమా డైరెక్టర్ హను రాఘవపూడి పరిచయంతో సహాయ దర్శకుడిగా తన కెరీర్ స్టార్ట్ చేశాడు. అలా చేస్తూనే మరో వైపు ఆర్ట్ డైరెక్టర్ కింద సహాయకుడిగా పనిచేసాడు. అలా పనిచేస్తూనే రాజమౌళి ఛత్రపతి సినిమాలో అవకాశం వచ్చింది. అలా నటుడుగా మారిన కమల్ ఆపైన శేఖర్ ఖమ్ముల గోదావరి ఆయన అసిస్టెంట్ సినిమా ఆవకాయ్ బిర్యానీ లో హీరోగా నటించాడు. ఇప్ప్పటికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి సినిమాలతో అలరిస్తున్న కమల్ తమ స్నేహితుడు అలాగే సినిమాల్లోకి రావడానికి ముఖ్య కారణం అయినా హను రాఘవపూడి తో తాజాగా ఒక సినిమా చేస్తున్నారట. ఇక ఆర్ట్ డైరెక్టర్ అలాగే అర్కిటెక్ కి ఉన్న తేడా గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడారు.

ఆర్ట్ డైరెక్టర్ తో ఇల్లు డైజైన్ చేయిస్తారు.. శేఖర్ ఖమ్ముల ఇల్లు డిజైన్ చేయమన్నాడు…

ఆర్ట్ డైరెక్షన్ లో పనిచేసేటపుడు ఏమి తెలిసేది కాదని అర్కిటెక్ కు దానికి చాలా తేడా ఉందంటూ చెప్తారు కమల్. శేఖర్ ఖమ్ముల సినిమాలో మొదట అవకాశం వచ్చినపుడు హను ని సలహా అడిగితే పిచ్చా ముందు వెళ్లి చెయ్ అని చెప్పాడు అలా గోదావరి సినిమాలో చేసానంటూ చెప్పారు. అలా ఏర్పడిన పరిచయం నుండి మంచి సన్నిహిత్యం శేఖర్ గారితో ఉండేది అంటూ చెప్పారు.

ఇక తన పెళ్ళి ఫిక్స్ అయి పెళ్ళి పనుల్లో బిజీగా ఉన్న సమయంలో శేఖర్ ఖమ్ముల ఫోన్ చేసి ఇల్లు డిజైన్ చేసి ఇమ్మని అడిగాడు. ఎలాంటి అనుభవం లేకుండా ఎలా చేయాలి ఎవరైనా అనుభవం ఉన్న అర్కిటెక్ తో ప్లాన్ వేయించి తీసుకువస్తా లేదంటే చాలా మంది సినిమా వాళ్ళు ఆర్ట్ డైరెక్టర్ ను అడిగితే వాళ్లకు తెలిసిన అర్కిటెక్ తో ప్లాన్ వేయిస్తారు అని చెబితే నాకు అవన్నీ వద్దు నువ్వురా ముందు అని చెప్పాడు. అలా ఆయన ఇల్లు ప్లాన్ చేసాం అని కమల్ తన సినిమా ఇండస్ట్రీ లోని స్నేహితుల గురించి తెలిపారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago