Categories: FeaturedMovie News

సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ టాప్ సింగర్ ఎస్‌.జానకి మరణవార్త !

తెలుగు చలన చిత్ర గాన సరస్వతి ఎస్.జానకి ఇకలేరనే రూమర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రముఖ టాలీవుడ్ సింగర్ ఎస్‌.జానకి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు సంగీతాభిమానులను కలవరపరుస్తున్నాయి.

సోషల్ మీడియాలో ఈ రూమర్స్ ను చదివిన ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురై వెంటనే స్పందించి మీడియా ముందుకొచ్చి.. జానకమ్మ ఆరోగ్యంపై దయచేసి ఇలాంటి రూమర్స్ ను క్రియేట్ చేయవద్దని వేడుకున్నారు. వాస్తవానికి జానకి గారికి ఒక చిన్న శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈ లోపలే ఆమె మరణించారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ సంచలనం సృష్టించడంతో జానకమ్మ ఆరోగ్యంపై వచ్చిన రూమర్‌పై టాలీవుడ్ గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం స్పందిస్తూ… ఇలాంటి రూమర్లు ఎందుకు పుట్టుకొస్తాయో అర్ధం కావట్లేదంటూ ఆవేదన చెందారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌లో ఆయన ఒక వీడియో మెసేజ్‌ను కూడా షేర్ చేశారు.

‘‘జానకమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఈరోజు నాకు చాలా మంది ఫోన్ చేశారు. సోషల్ మీడియాలో కొంత మంది జానకమ్మ గారు చనిపోయారంటూ రూమర్స్ క్రియేట్ చేయడం అర్థంపర్థంలేని పనులు. నేను జానకమ్మ గారితో స్వయంగా మాట్లాడాను. ఆమె ఆరోగ్యంగానే వున్నారని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా సోషల్ మీడియాను సమాజానికి మేలు చేసే పనులకే వినియోగించుకోవాలని.. ఇలాంటి చిలిపి చేష్టలు చేయడం కరెక్ట్ కాదని బాలు మండిపడ్డారు. జానకమ్మ గారి వయస్సు ప్రస్తుతం 82 సంవత్సరాలు. సినిమా ఇండస్ట్రీలోనే వైవిధ్యమైన గాయనిగా ఖ్యాతిని గడించిన ఆమె గత జ్ణాపకాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే..

ఎస్‌. జానకి దశాబ్దాలుగా తన గానామృతంతో సినీ, సంగీత ప్రియులను ఓలలాడిస్తున్న గాన సరస్వతి. అఖండ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన మకుటంలేని మహారాణి ఎస్‌. జానకి. ఆమె గొంతు విప్పితే ప్రకృతి కూడా తన్మయత్వంతో పరవశించిపోతుంది. అమ్మఒడిలో ఏడుస్తున్న పసిపాపలు సైతం హాయిగా నిద్రలోకి జారిపోతుంటారు. అదీ జానకమ్మ గారి పాటలలోని గొప్పదనం. ఆమె పాటలతో ఆడే ఆటలు సినీ, సంగీత ప్రియులను ఆనందాశ్చర్యాలకు గురి చేసిన సందర్భాలెన్నో వున్నాయి. పాటలతో మిమిక్రి చేసి చూపించిన అరుదైన సంగీత సరస్వతి జానకమ్మ. ‘పదహారేళ్ల వయసు’ చిత్రంలో ‘‘కట్టుకథలు చెప్పి.. నేను కవ్విస్తే..’’ పాటలో పండు ముసలావిడగా.. ‘స్వాతి ముత్యం’లో ‘‘చిన్నారి పొన్నారి కిట్టయ్యా..’’ అంటూ చిన్నారి గొంతు.. ‘శ్రీవారి శోభనం’లో ‘‘అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక..’’ పాటలో బామ్మగా విభిన్న రకాల గొంతులతో గీతాలు ఆలపించి తనకు తానే సాటి.. సంగీత సామ్రాజ్యంలో తనకెవ్వరూ లేరు పోటీ అని నిరూపించుకున్నారు. 5 దశాబ్దాలకు పైగా సినీ జీవితంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 50,000 పైగా గీతాలను ఆలపించారు. ఉత్తమ గాయనిగా 4 జాతీయ పురస్కారాలు, వివిధ రాష్ట్రాల్లో ఉత్తమగాయనిగా 31 సార్లు అవార్డులు అందుకున్నారు ఎస్‌.జానకి. ఇక ఆమె వ్యక్తిగత వివరాలను పరిశీలిస్తే..

ఆమె పూర్తి పేరు శిష్ఠా శ్రీరామమూర్తి జానకి. 1938 ఏప్రిల్‌ 23న ఆంధ్రాలోని గుంటూరు జిల్లా, రేపల్లెకు దగ్గర్లో వున్న పల్లపట్ల అనే కుగ్రామంలో జన్మించింది. తండ్రి శ్రీరామమూర్తి, తల్లి సత్యవతి. తండ్రి ఉపాధ్యాయుడు, మరియు ఆయుర్వేద వైద్యుడు కావడంతో ఉద్యోగరిత్యా వివిధ ప్రాంతాల్లో పని చేసేవారు. జానకికి చిన్న వయస్సు నుంచి సంగీతంపై ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తితోనే చిన్నతనంలోనే ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసి సంగీతంలో రాణించింది. నాదస్వరం విద్వాన్‌ పైడిస్వామి వద్ద సంగీతంలో ఓనమాలు దిద్దుకుంది. తన 3వ ఏట నుంచే అనేక పాటల కచేరీల్లో పాల్గొన్న జానకి, తన కార్యక్రమాల్లో ఎక్కువగా పి.సుశీల, జిక్కి, పి.లీల పాడిన పాటలను పాడుతుండేది. అలా చిన్నతనంలోనే తనదైన సంగీత ప్రతిభతో అందరి దృష్టినీ ఆకర్షించింది జానకి. ఆ తర్వాత కొన్నాళ్లకు తన మామయ్య సలహాతో 19 ఏళ్ల వయసులో చెన్నై చేరుకొని సినీ రంగంలో అడుగు పెట్టడానికి సిద్ధపడింది.

జానకమ్మ చెన్నైలో అడుగు పెట్టిన రోజుల్లోలో AVM స్టూడియోలో గాయనిగా ఉండేది. అక్కడ చిన్నచిన్న ఆల్బమ్స్‌ చేస్తూనే తన ప్రతిభను మరింత సానబెట్టుకుంది. ఆ సమయంలోనే జానకిలోని స్వర ప్రతిభను చూసి సంగీత దర్శకులు టి.చలపతిరావు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘విధియిన్‌ విలాయత్తు’లో పాట పాడే ఛాన్స్ ఇచ్చారు. ఇందులో జానకమ్మ, పి.బి.శ్రీనివాస్‌తో కలిసి తొలిసారిగా తన గొంతును వినిపించారు. కానీ అనుకోని ఆవాంతరాల వలన ఆ చిత్రం రిలీజ్ కాలేదు. ఆ తర్వాత ‘ఎం.ఎల్‌.ఏ’ చిత్రంలో ఘంటసాలతో కలిసి ‘‘నీ ఆశ అడియాస..’’ పాట పాడారు. ఇది ఆమె పాడిన తొలి తెలుగు సినీ గీతం. ఈ పాటకు మంచి ఆదరణ లభించింది. అక్కడి నుంచి మొదలైన ఆమె గాన మాధుర్యం సెలయేరులా సాగుతూ, ఎన్నో మలుపులు తిరుగుతూ ఆబాలగోపాలాన్నీ అలరింపజేసింది.

జానకి సినిమాల్లో పాటలు పాడటం మొదలు పెట్టిన రోజుల్లో దాదాపుగా ఎక్కువ విషాద గీతాలనే ఆలపించింది. వాటితోనే మంచి పేరును సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన అవకాశాలతో హుషారైన పాటలతోనూ అలరించింది. ఓవైపు నేపథ్య గాయనిగా రాణిస్తూనే కొన్ని చిత్రాలకు సంగీత దర్శకురాలిగానూ పనిచేసి మెప్పించింది జానకమ్మ. ఆమె తొలిసారి ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ నిర్మించిన ‘మౌన పోరాటం’ సినిమాకు సంగీత దర్శకత్వం వహించి, సంగీత దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకుంది. విషాదమైనా, ఆనందమైనా, ప్రేమ భావనైనా ఎలాంటి భావాలనైనా జానకి తన గొంతుతో అద్భుతంగా పలికించి చూపిస్తుంది. దానికి భాషా, ప్రాంతీయ భేదాలుండవు. ఆమె ఆలపించిన గీతాల్లో ‘‘మేఘమా దేహమా..’’ పాటలో ఆమె స్వరంలో పలికిన ఆర్ద్రత.. ‘‘ఆకాశం ఏనాటిదో.. ఆనందం ఆనాటిది..’’ అని సాగే గీతంలో ఆమె హృదయం నుంచి ఉప్పొంగిన ప్రేమ తత్వం.. ‘‘వెన్నెల్లో గోదావరి అందం..’’ పాటలో పలికించిన ఆవేదన.. ‘‘తొలిసారి మిమ్మల్ని చూసింది..’’ పాటలో కనబర్చిన అల్లరి సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి.

ఏ తరం కథానాయికలకైనా సరిపోయేట్లు తన స్వరాన్ని సవరించుకోవడం జానకమ్మకి తెలిసినట్లు మరెవరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. అదీ ఆమె ప్రత్యేకత. వయసు మీద పడుతున్నా ఆ ప్రభావం తన వాణిపై పడకుండా 82 ఏళ్ల వయసులోనూ తన సుమధురమైన స్వరాలతో సినీ, సంగీత ప్రియులను తన గానామృతంలో సమ్మోహపరిచిన జానకమ్మ గారు వీలైనంత త్వరగా కోలుకుని మళ్ళీ తన స్వరాభిషేకాన్ని పునః ప్రారంభించాలని ఆశిద్దాం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago