Connect with us

Featured

సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ టాప్ సింగర్ ఎస్‌.జానకి మరణవార్త !

Published

on

తెలుగు చలన చిత్ర గాన సరస్వతి ఎస్.జానకి ఇకలేరనే రూమర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రముఖ టాలీవుడ్ సింగర్ ఎస్‌.జానకి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు సంగీతాభిమానులను కలవరపరుస్తున్నాయి.

సోషల్ మీడియాలో ఈ రూమర్స్ ను చదివిన ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురై వెంటనే స్పందించి మీడియా ముందుకొచ్చి.. జానకమ్మ ఆరోగ్యంపై దయచేసి ఇలాంటి రూమర్స్ ను క్రియేట్ చేయవద్దని వేడుకున్నారు. వాస్తవానికి జానకి గారికి ఒక చిన్న శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈ లోపలే ఆమె మరణించారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ సంచలనం సృష్టించడంతో జానకమ్మ ఆరోగ్యంపై వచ్చిన రూమర్‌పై టాలీవుడ్ గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం స్పందిస్తూ… ఇలాంటి రూమర్లు ఎందుకు పుట్టుకొస్తాయో అర్ధం కావట్లేదంటూ ఆవేదన చెందారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌లో ఆయన ఒక వీడియో మెసేజ్‌ను కూడా షేర్ చేశారు.

‘‘జానకమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఈరోజు నాకు చాలా మంది ఫోన్ చేశారు. సోషల్ మీడియాలో కొంత మంది జానకమ్మ గారు చనిపోయారంటూ రూమర్స్ క్రియేట్ చేయడం అర్థంపర్థంలేని పనులు. నేను జానకమ్మ గారితో స్వయంగా మాట్లాడాను. ఆమె ఆరోగ్యంగానే వున్నారని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా సోషల్ మీడియాను సమాజానికి మేలు చేసే పనులకే వినియోగించుకోవాలని.. ఇలాంటి చిలిపి చేష్టలు చేయడం కరెక్ట్ కాదని బాలు మండిపడ్డారు. జానకమ్మ గారి వయస్సు ప్రస్తుతం 82 సంవత్సరాలు. సినిమా ఇండస్ట్రీలోనే వైవిధ్యమైన గాయనిగా ఖ్యాతిని గడించిన ఆమె గత జ్ణాపకాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే..

ఎస్‌. జానకి దశాబ్దాలుగా తన గానామృతంతో సినీ, సంగీత ప్రియులను ఓలలాడిస్తున్న గాన సరస్వతి. అఖండ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన మకుటంలేని మహారాణి ఎస్‌. జానకి. ఆమె గొంతు విప్పితే ప్రకృతి కూడా తన్మయత్వంతో పరవశించిపోతుంది. అమ్మఒడిలో ఏడుస్తున్న పసిపాపలు సైతం హాయిగా నిద్రలోకి జారిపోతుంటారు. అదీ జానకమ్మ గారి పాటలలోని గొప్పదనం. ఆమె పాటలతో ఆడే ఆటలు సినీ, సంగీత ప్రియులను ఆనందాశ్చర్యాలకు గురి చేసిన సందర్భాలెన్నో వున్నాయి. పాటలతో మిమిక్రి చేసి చూపించిన అరుదైన సంగీత సరస్వతి జానకమ్మ. ‘పదహారేళ్ల వయసు’ చిత్రంలో ‘‘కట్టుకథలు చెప్పి.. నేను కవ్విస్తే..’’ పాటలో పండు ముసలావిడగా.. ‘స్వాతి ముత్యం’లో ‘‘చిన్నారి పొన్నారి కిట్టయ్యా..’’ అంటూ చిన్నారి గొంతు.. ‘శ్రీవారి శోభనం’లో ‘‘అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక..’’ పాటలో బామ్మగా విభిన్న రకాల గొంతులతో గీతాలు ఆలపించి తనకు తానే సాటి.. సంగీత సామ్రాజ్యంలో తనకెవ్వరూ లేరు పోటీ అని నిరూపించుకున్నారు. 5 దశాబ్దాలకు పైగా సినీ జీవితంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 50,000 పైగా గీతాలను ఆలపించారు. ఉత్తమ గాయనిగా 4 జాతీయ పురస్కారాలు, వివిధ రాష్ట్రాల్లో ఉత్తమగాయనిగా 31 సార్లు అవార్డులు అందుకున్నారు ఎస్‌.జానకి. ఇక ఆమె వ్యక్తిగత వివరాలను పరిశీలిస్తే..

Advertisement

ఆమె పూర్తి పేరు శిష్ఠా శ్రీరామమూర్తి జానకి. 1938 ఏప్రిల్‌ 23న ఆంధ్రాలోని గుంటూరు జిల్లా, రేపల్లెకు దగ్గర్లో వున్న పల్లపట్ల అనే కుగ్రామంలో జన్మించింది. తండ్రి శ్రీరామమూర్తి, తల్లి సత్యవతి. తండ్రి ఉపాధ్యాయుడు, మరియు ఆయుర్వేద వైద్యుడు కావడంతో ఉద్యోగరిత్యా వివిధ ప్రాంతాల్లో పని చేసేవారు. జానకికి చిన్న వయస్సు నుంచి సంగీతంపై ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తితోనే చిన్నతనంలోనే ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసి సంగీతంలో రాణించింది. నాదస్వరం విద్వాన్‌ పైడిస్వామి వద్ద సంగీతంలో ఓనమాలు దిద్దుకుంది. తన 3వ ఏట నుంచే అనేక పాటల కచేరీల్లో పాల్గొన్న జానకి, తన కార్యక్రమాల్లో ఎక్కువగా పి.సుశీల, జిక్కి, పి.లీల పాడిన పాటలను పాడుతుండేది. అలా చిన్నతనంలోనే తనదైన సంగీత ప్రతిభతో అందరి దృష్టినీ ఆకర్షించింది జానకి. ఆ తర్వాత కొన్నాళ్లకు తన మామయ్య సలహాతో 19 ఏళ్ల వయసులో చెన్నై చేరుకొని సినీ రంగంలో అడుగు పెట్టడానికి సిద్ధపడింది.

జానకమ్మ చెన్నైలో అడుగు పెట్టిన రోజుల్లోలో AVM స్టూడియోలో గాయనిగా ఉండేది. అక్కడ చిన్నచిన్న ఆల్బమ్స్‌ చేస్తూనే తన ప్రతిభను మరింత సానబెట్టుకుంది. ఆ సమయంలోనే జానకిలోని స్వర ప్రతిభను చూసి సంగీత దర్శకులు టి.చలపతిరావు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘విధియిన్‌ విలాయత్తు’లో పాట పాడే ఛాన్స్ ఇచ్చారు. ఇందులో జానకమ్మ, పి.బి.శ్రీనివాస్‌తో కలిసి తొలిసారిగా తన గొంతును వినిపించారు. కానీ అనుకోని ఆవాంతరాల వలన ఆ చిత్రం రిలీజ్ కాలేదు. ఆ తర్వాత ‘ఎం.ఎల్‌.ఏ’ చిత్రంలో ఘంటసాలతో కలిసి ‘‘నీ ఆశ అడియాస..’’ పాట పాడారు. ఇది ఆమె పాడిన తొలి తెలుగు సినీ గీతం. ఈ పాటకు మంచి ఆదరణ లభించింది. అక్కడి నుంచి మొదలైన ఆమె గాన మాధుర్యం సెలయేరులా సాగుతూ, ఎన్నో మలుపులు తిరుగుతూ ఆబాలగోపాలాన్నీ అలరింపజేసింది.

జానకి సినిమాల్లో పాటలు పాడటం మొదలు పెట్టిన రోజుల్లో దాదాపుగా ఎక్కువ విషాద గీతాలనే ఆలపించింది. వాటితోనే మంచి పేరును సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన అవకాశాలతో హుషారైన పాటలతోనూ అలరించింది. ఓవైపు నేపథ్య గాయనిగా రాణిస్తూనే కొన్ని చిత్రాలకు సంగీత దర్శకురాలిగానూ పనిచేసి మెప్పించింది జానకమ్మ. ఆమె తొలిసారి ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ నిర్మించిన ‘మౌన పోరాటం’ సినిమాకు సంగీత దర్శకత్వం వహించి, సంగీత దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకుంది. విషాదమైనా, ఆనందమైనా, ప్రేమ భావనైనా ఎలాంటి భావాలనైనా జానకి తన గొంతుతో అద్భుతంగా పలికించి చూపిస్తుంది. దానికి భాషా, ప్రాంతీయ భేదాలుండవు. ఆమె ఆలపించిన గీతాల్లో ‘‘మేఘమా దేహమా..’’ పాటలో ఆమె స్వరంలో పలికిన ఆర్ద్రత.. ‘‘ఆకాశం ఏనాటిదో.. ఆనందం ఆనాటిది..’’ అని సాగే గీతంలో ఆమె హృదయం నుంచి ఉప్పొంగిన ప్రేమ తత్వం.. ‘‘వెన్నెల్లో గోదావరి అందం..’’ పాటలో పలికించిన ఆవేదన.. ‘‘తొలిసారి మిమ్మల్ని చూసింది..’’ పాటలో కనబర్చిన అల్లరి సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి.

ఏ తరం కథానాయికలకైనా సరిపోయేట్లు తన స్వరాన్ని సవరించుకోవడం జానకమ్మకి తెలిసినట్లు మరెవరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. అదీ ఆమె ప్రత్యేకత. వయసు మీద పడుతున్నా ఆ ప్రభావం తన వాణిపై పడకుండా 82 ఏళ్ల వయసులోనూ తన సుమధురమైన స్వరాలతో సినీ, సంగీత ప్రియులను తన గానామృతంలో సమ్మోహపరిచిన జానకమ్మ గారు వీలైనంత త్వరగా కోలుకుని మళ్ళీ తన స్వరాభిషేకాన్ని పునః ప్రారంభించాలని ఆశిద్దాం.

Continue Reading
Advertisement

Featured

Venu Swamy: ఆవిడ నన్ను ప్రేమించింది.. నేను ప్రేమించాల్సి వచ్చింది: వేణు స్వామి రియల్

Published

on

Venu Swamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు. ఈయన ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతోమంది సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచు వార్తల్లో నిలిచారు. కేవలం రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ఈయన పెద్ద ఎత్తున అభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు.

ఇకపోతే ఇటీవల కాలంలో వేణు స్వామి తన భార్య వీణా వాణితో కలిసి రీల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజుల క్రితం ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాలోని డైలాగుకు రీల్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే తాజాగా మరొకరి వీడియో ద్వారా ఈయన అభిమానుల ముందుకు వచ్చారు.

ఈ క్రమంలోనే నాగార్జున సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించిన మన్మధుడు సినిమాలోని ఒక సీన్ రీ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున సోనాలి బింద్రే ఇద్దరు ప్యారిస్ వెళ్లగా అక్కడ బ్రహ్మానందంతో ఓ సన్నివేశం వస్తుంది. మీ ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ అంటూ నాగార్జున బ్రహ్మానందం ని అడగడంతో అందుకు ఆయన చెబుతూ మొదట ఆమె నన్ను ప్రేమించింది తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అనే డైలాగును వేణు స్వామి కూడా రీ క్రియేట్ చేశారు.

Advertisement

ఊపిరి పీల్చుకో..

ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వామ్మో వేణు స్వామిలో ఈ యాంగిల్ కూడా ఉందా సోషల్ మీడియా ఇక ఊపిరి పీల్చుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా జ్యోతిష్యం చెబుతూనే వార్తలలో నిలిచినటువంటి ఈయన ఇప్పుడు మాత్రం రీల్స్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారని చెప్పాలి.

https://www.instagram.com/reel/C5oDUlhxisr/?utm_source=ig_embed&ig_rid=c69f6a00-74ea-461b-b532-7e7a5316f48a

Advertisement

Continue Reading

Featured

Rashmika: నాకంటే అందగత్తెలు ఉన్నారు.. రష్మిక కామెంట్స్ వైరల్!

Published

on

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా స్టార్ డం గురించి ఈమె మాట్లాడారు.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు అయితే నాకంటే ఎంతో అందమైన అమ్మాయిలు ఉన్నారు అలాగే బాగా నటించగలిగే వారు ఉన్నారు వారందరూ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని తెలిపారు.

ఇలా నేను ఇక్కడ వాళ్లు అక్కడ ఉండటానికి కారణం అదృష్టం మాత్రమేనని ఈమె తెలిపారు. నాకు అదృష్టం రావడంతో ఇక్కడికి వచ్చానని ఈమె తెలియజేశారు. ఇలా వచ్చిన అదృష్టాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకొని నన్ను నేను నిరూపించుకోవడం కోసం ప్రయత్నాలు చేశానని రష్మిక తెలిపారు.

Advertisement

పతనానికి కారణం..
సినిమా ఇండస్ట్రీలో అని మాత్రమే కాదు ఏ రంగంలో అయినా కూడా జయాలు అపజయాలు అనేది సర్వసాధారణంగా ఉంటాయి అయితే మనం విజయం సాధించినప్పుడు ఆ పొగరు తలకెక్కించుకోకూడదు అలా ఎక్కించుకున్నాము అంటే ఆ ప్రభావం మన మనసుపై పడుతుందని అది పతనానికి కారణం అవుతుంది అంటూ రష్మిక ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ramcharan: డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్.. ఇది వారందరికీ దక్కిన గౌరవం అంటూ?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఇటీవల చెన్నై వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీకి అందించినటువంటి సేవలను గుర్తించినటువంటి వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం జరిగినటువంటి యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమాలలో భాగంగా రామ్ చరణ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన డాక్టరేట్ అందుకోవడంతో రామ్ చరణ్ కాస్త ఇకపై డాక్టర్ రామ్ చరణ్ గా మారిపోయారని చెప్పాలి. ఇక ఈయనకు డాక్టర్ అందించడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా డాక్టరేట్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చెన్నైలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేల్స్ యూనివర్సిటీ నుంచి నాకు ఈ గౌరవం దక్కడం నిజంగా సంతోషంగా అనిపిస్తుందని ఈయన వెల్లడించారు. ఆర్మీ లాంటి గ్రాడ్యుయేషన్ మధ్యలో నేను ఇలా ఈరోజు ఉండటం  ఊహిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement

అందరి గౌరవం ఇదీ…
ఈరోజు ఇలా డాక్టరేట్ అందుకున్నాను అంటే అది కేవలం నాకు దగ్గర గౌరవం మాత్రమే కాదని తెలిపారు నన్ను ఆదరించిన అభిమానులది నన్ను నమ్మి సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలది అంటూ రాంచరణ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ యూనివర్సిటీని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ఇక్కడ నిర్వాహకులకు అధ్యాపకులకు అలాగే విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!