Software employee death mystery : తెలంగాణ రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల మణి రాజ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండగా పాస్ పోర్ట్ రెన్యూవల్ కోసం ఇండియా వచ్చి స్వస్థలం వరంగల్ కి వచ్చాడు. ఇక హైదరాబాద్ లో పాస్ పోర్ట్ కార్యాలయంలో రెన్యూవల్ కి సంబంధించిన పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చి స్నేహితులతో తిరిగిన మణిరాజ్ మరుసటి రోజు ఉదయం స్నేహితుడిని ఇంటిలో బాత్రూంలో శవమై కనిపించాడు.
గుడికి, పబ్ కి వెళ్లిన మణి రాజ్ ఉదయం శవమై…
పాస్ పోర్టు పని కోసం హైదరాబాద్ లోని ఉప్పల్ మెట్రో స్టేషన్ కి మణి రాజ్ తండ్రి నవీన్ డ్రాప్ చేసి వెళ్లగా మణి రాజ్ ఆ పనులను ముగించుకుని స్నేహితులను కలిసి వెస్ట్ మారేడు పల్లి వినాయకుడి గుడికి అలాగే జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నాడు. ఇక రాత్రి పబ్ కి వెళ్లి ఆలస్యంగా అక్కడే మణికొండ అలకాపూర్ టౌన్ షిప్ రోడ్ నెంబర్ 20 లో సిద్ధార్థ రెసిడెన్సీలో ఉంటున్న స్నేహితుడు కొత్త చాణక్య అనే వ్యక్తి అపార్టుమెంట్ కి వెళ్ళాడు. ఉదయం అపార్ట్మెంట్ మీటింగ్ కోసమని ఆదివారం నాడు కిందికి వెళ్లిన చాణక్య మణి రాజ్ బాత్రూం వెళ్లిన సంగతి చూడలేదు.
మీటింగ్ అయ్యాక ఉదయం 11:30 సమయంలో ఇంట్లోకి వచ్చి బాత్రూం తలుపు తట్టి చూడగా లోపల నుండి గడిపెట్టుకుని ఉండటంతో ఎంత సేపటికి లోపల నుండి ఎలాంటి శబ్దం రాకపోవడంతో చుట్టుపక్కల వాళ్ల సహాయంతో తలుపు బద్ధలుకొట్టి చూడగా ఆపస్మారక స్థితిలో మణిరాజ్ కనిపించాడు. వెంటనే 108 కి కాల్ చేసిన చాణక్య హాస్పిటల్ కి తరలించగా అప్పటికే అతను గుండె పోటుతో మరణించినట్లు ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన తండ్రి నవీన్ కుమార్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మృతికి అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…