Categories: Political News

“నా భర్తను ఏదో చేశారు!” లోకేష్ మనుషులు బెదిరించారు.. సింగయ్య మృతిపై భార్య సంచలన ఆరోపణలు!

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డి ఇటీవల చేపట్టిన టూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. సింగయ్య భార్య లూర్దు మేరి మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు.

“Something was done to my husband!” Wife makes sensational allegations over Singayya’s death!

“నా భర్తను ఏదో చేశారు!”
లూర్దుమేరి మాట్లాడుతూ, “నా భర్తకు పెద్దగా గాయాలు లేవు.. అలాంటప్పుడు ఆయన ఎలా చనిపోతారు?” అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడమే కాకుండా, అంబులెన్సులో ఏదో చేశారని అనిపిస్తోంది” అని ఆమె పేర్కొన్నారు.

లోకేష్ మనుషుల బెదిరింపులు?
సింగయ్య మరణాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని, “లోకేష్‌ కు చెందిన యాభై మంది మా ఇంటికి వచ్చారు. మేము చెప్పింది చెప్పారు అని ఒప్పుకోవాలంటూ బెదిరించారు. కాగితాలపై ఏదో రాసి సంతకాలు చేయమన్నారు” అని ఆరోపించారు. ఆమె మాటల్లో ఆవేదన స్పష్టంగా కనిపించింది.

జగన్‌ అంటే మాకు ఇష్టం..
తమ కుటుంబం జగన్‌ను మెచ్చుకుంటుందని స్పష్టం చేసిన లూర్దుమేరి, “ఆయన మా కులస్తుల ముద్దు.. అందుకే కలిశాం. ఆయన మా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు” అని తెలిపారు. అదే సమయంలో పోలీసులు కూడా తమపై ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. “వీడియో చూపించి సంతకాలు పెట్టమన్నారు” అంటూ విమర్శలు గుప్పించారు.

ఈ సంఘటన ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. లూర్దుమేరి చేసిన ఆరోపణలపై అధికార పార్టీ, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయన్న దానిపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. వాస్తవం ఏదైనా, సింగయ్య మృతి నేపథ్యంలో జరుగుతున్న ఈ రాజకీయ ఆరోపణలు మరింత తీవ్రంగా మారే అవకాశముంది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago