వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇటీవల చేపట్టిన టూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. సింగయ్య భార్య లూర్దు మేరి మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు.

“నా భర్తను ఏదో చేశారు!”
లూర్దుమేరి మాట్లాడుతూ, “నా భర్తకు పెద్దగా గాయాలు లేవు.. అలాంటప్పుడు ఆయన ఎలా చనిపోతారు?” అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడమే కాకుండా, అంబులెన్సులో ఏదో చేశారని అనిపిస్తోంది” అని ఆమె పేర్కొన్నారు.
లోకేష్ మనుషుల బెదిరింపులు?
సింగయ్య మరణాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని, “లోకేష్ కు చెందిన యాభై మంది మా ఇంటికి వచ్చారు. మేము చెప్పింది చెప్పారు అని ఒప్పుకోవాలంటూ బెదిరించారు. కాగితాలపై ఏదో రాసి సంతకాలు చేయమన్నారు” అని ఆరోపించారు. ఆమె మాటల్లో ఆవేదన స్పష్టంగా కనిపించింది.
జగన్ అంటే మాకు ఇష్టం..
తమ కుటుంబం జగన్‌ను మెచ్చుకుంటుందని స్పష్టం చేసిన లూర్దుమేరి, “ఆయన మా కులస్తుల ముద్దు.. అందుకే కలిశాం. ఆయన మా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు” అని తెలిపారు. అదే సమయంలో పోలీసులు కూడా తమపై ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. “వీడియో చూపించి సంతకాలు పెట్టమన్నారు” అంటూ విమర్శలు గుప్పించారు.
ఈ సంఘటన ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. లూర్దుమేరి చేసిన ఆరోపణలపై అధికార పార్టీ, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయన్న దానిపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. వాస్తవం ఏదైనా, సింగయ్య మృతి నేపథ్యంలో జరుగుతున్న ఈ రాజకీయ ఆరోపణలు మరింత తీవ్రంగా మారే అవకాశముంది.
జగన్ రెంటపాళ్ల పర్యటనలో మృతి చెందిన సింగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు
— ChotaNews App (@ChotaNewsApp) July 2, 2025
నా భర్తను అంబులెన్స్ లో ఎవరో ఏమో చేశారు, అందుకే చనిపోయి ఉంటాడని మాకు అనుమానంగా ఉంది.
చిన్న చిన్న గాయాలకే మా ఆయన ఎలా చనిపోతాడు?
సింగయ్య చనిపోయాక మంత్రి లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికొచ్చి మమ్మల్ని ఇబ్బంది… pic.twitter.com/VYHj9kRzcC



































