పంచతంత్ర కథలు చిత్రంలోని సాంగ్ వీడియో రిలీజ్.. మామూలుగా లేదుగా..?
గంగనమోని శేఖర్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న తాజా చిత్రం పంచతంత్ర కథలు. ఈ సినిమాను మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా ప్రముఖ నిర్మాత మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో దర్శకుడు గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఐదు వేర్వేరు కథల ఆంథాలజీ కావడంతో ఈ సినిమాకు పంచతంత్ర కథలు అనే టైటిల్ ను పెట్టారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి మోతెవరి అనే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. లిరికల్ వీడియో సాంగ్ ను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఇక ఈ పాటకు కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించగా సంగీతదర్శకుడు కమ్రాన్ క్యాచీ ట్యూన్ తో స్వరపరిచాడు. కాకపోతే లేటెస్ట్ సెన్సేషన్ రామ్ మిరియాల ఈ పాటను తనదైన శైలిలో ఆలపించారు. తాజాగా విడుదల ఈ పాటకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తుంది.
ఇక ఈ పాటను విడుదల చేసిన తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. పంచతంత్ర కథలు సినిమా లోని నేనేమో మోతెవరి అనేక సాంగ్ రిలీజ్ చేయడం తనకు చాలా సంతోషంగా ఉంది అని తరుణ్ భాస్కర్. అది తనకు ఫేవరెట్ సాంగ్ అని, పంచతంత్ర కథలు సినిమా రఫ్ కట్ చూసినప్పుడే ఆ సాంగ్ విన్నాడట తరుణ్ భాస్కర్. అయితే ఈ సాంగ్ తప్పకుండా వైరల్ అవుతుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను అని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…