Chiranjeevi : నేషనల్ లెవెల్ లో ఇండియన్ ఐడల్ సింగింగ్ ప్రోగ్రామ్ చాలా ఫేమస్. ఈ షో నుండి చాలా మంది ప్రతిభ ఉన్న గాయకులు సినిమా ఇండస్ట్రీకి పరిచయమవుతు ఉంటారు. తెలుగులో కూడా పాడుతా తీయగా సరిగమప వంటి సింగింగ్ కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయి. ఇక ఆహా ఒరిజినల్స్ లో కూడా ఇండియన్ ఐడల్ ఫ్రాంచైస్ లో తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ వస్తోంది. చాలా తక్కువ సమయంలో ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది.
ఫైనల్స్ కి చేరుకున్న ప్రోగ్రామ్…
తెలుగు ఇండియన్ ఐడల్ షోకి జడ్జెస్ గా ఉషా ఉత్తుప్, నిత్యా మీనన్, కార్తీక్ థమన్ వ్యవహారిస్తున్నారు. ఇక హోస్ట్ గా ఇండియన్ ఐడల్ శ్రీరామ చంద్ర వ్యవహారిస్తున్న ఈ షో ఇపుడు ఫైనల్స్ కి చేరుకుంది. ఇటీవలే బాలకృష్ణ ఈ షో కి వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసారు ఆహా టీం. గత కొన్నిరోజులుగా గ్రాండ్ ఫినాలే గురించి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇక చిరంజీవి, రానా, సాయి పల్లవి ఈ షో గ్రాండ్ ఫినాలే కి గెస్ట్ అంటూ ప్రచారం జరిగినా ఈ విషయంలో క్లారిటీ లేదు. అయితే ఇపుడు చిరు తో జడ్జెస్ తీసుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది దీంతో చిరు గ్రాండ్ ఫినాలే కి వచ్చారన్నది కన్ఫర్మ్ అయింది.
అలిగి వెళ్లిపోయిన చిరు….
ఇక గ్రాండ్ ఫినాలే కి చిరంజీవి వచ్చారన్న క్లారిటీ వచ్చేసింది. టాప్ సింగర్స్ లో ఎవరు విజేతలవుతారో అన్న ఉత్కంఠకు తెరపడనుంది. అయితే ఈ గ్రాండ్ ఫినాలే నుండి మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిరు హోస్ట్ పై అసహనంతో అలిగి వెళ్లిపోయారని. షో దాదాపు పూర్తయ్యాక ఈ ఘటన జరిగిందని అంటున్నారు. హోస్ట్ చివర్లో రీ టేక్ లు తీసుకోవడంతో చిరు అసహనానికి గురయ్యారని కోపంగా షో నుండి వెళ్లిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం ఎంత వరకు నిజముందో క్లారిటీ రావాల్సి ఉంది.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…