Actor Srikanth:తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో అలాగే ప్రేమకథా చిత్రాల్లోతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో అలాగే ప్రేమకథా చిత్రాల్లో నటించి ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్ ప్రస్తుతం విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులకు సందడి చేస్తున్నారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా మంచి గుర్తింపు పొందిన శ్రీకాంత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.ఇకపోతే తన కెరీర్లో ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని ఫ్లాప్ అయిన సినిమాల గురించి ప్రస్తావించగా అలాంటి సినిమాలు చాలా ఉన్నాయని అయితే అందులో సౌందర్య శ్రీకాంత్ నటించిన తారక రాముడు సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాము ఆ సినిమా ఫ్లాప్ అయింది అదేవిధంగా సౌందర్యతో కలిసి అనగనగా ఒక అమ్మాయి అనే మరొక సినిమా ఈ విషయంలో కూడా డిసప్పాయింట్ అయ్యామని తెలిపారు.
ఇక ఇంటర్వ్యూ సందర్భంగా నటుడు శ్రీకాంత్ హీరోయిన్ సౌందర్యని తలుచుకుని బాధ పడ్డారు. తను చాలా మంచి ఆర్టిస్ట్ అని అయితే మనం ఏం చేయలేం అంటూ శ్రీకాంత్ సౌందర్యని గుర్తు చేసుకున్నారు. ఇక తనతో కలిసి ఆరు సినిమాల వరకు నటించానని ఈ సందర్భంగా తెలిపారు. ఇకపోతే తను నటించిన సినిమాలలో ఏదైనా వివాదానికి దారితీస్తుందా అని ప్రశ్నించగా తను పెద్దగా కాంట్రవర్సీ అయ్యే సినిమాలో నటించలేదని కానీ ఖడ్గం సినిమాలో నటించినందుకు నాకు ఎంతో మంది నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.
ఖడ్గం సినిమాలో ముస్లింలకు వ్యతిరేకంగా చెప్పిన డైలాగ్స్ కారణంగా తనకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయని అయితే ఎప్పుడూ పెద్దగా భయపడ లేదని తెలిపారు. అయితే క్రికెట్ ఆడటం కోసం వెళ్ళినప్పుడు జోబులో గన్ పెట్టుకుని వెళ్లానని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సమయంలో నా రక్షణ కోసం జోబులో గన్ పెట్టుకొని వెళ్లేవాణ్ణి అంటూ ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలియజేశారు. ప్రస్తుతం శ్రీకాంత్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…